నగరంలో పెరిగిన ‘కరోనా’ మృతులు

ABN , First Publish Date - 2021-04-14T17:13:08+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌బారిన పడి 67 మంది మృతి చెందారు. మృతుల్లో రాజధాని బెంగళూరుకు చెందిన వారే 55 మంది ఉన్నారు. కలబుర్గిలో నలుగురు, మై

నగరంలో పెరిగిన ‘కరోనా’ మృతులు


బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ ‌బారిన పడి 67 మంది మృతి చెందారు. మృతుల్లో రాజధాని బెంగళూరుకు చెందిన వారే 55 మంది ఉన్నారు. కలబుర్గిలో నలుగురు, మైసూరు, బీదర్‌లో ఇద్దరు చొప్పున, ధార్వాడ, హావేరీ, బెళగావి, విజయపురలలో ఒకరిచొప్పున మృతి చెందారు. మంగళవారం విడుదలైన బులెటిన్‌లో 8,778 మంది పాజిటివ్‌ బారినపడగా అత్యధికంగా బెంగళూరులో 5,500 మంది బాధితులు ఉన్నారు. మైసూరులో 492, తుమకూరులో 350, కలబుర్గిలో 290, బీదర్‌లో 198, బళ్ళారి 168, దక్షిణకన్నడ 142, ధార్వాడలో 132 మంది బాధితులయ్యారు. ఇతర జిల్లాల్లోనూ ప్రభావం చూపింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా 6,079 మంది కోలుకోగా బెంగళూరులో 4,415 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 30 జిల్లాల్లో 78,167 యాక్టివ్‌ కేసులు ఉండగా 474మంది ఉన్నారు. బెంగళూరులో కొవిడ్‌ మృతుల సంఖ్య పెరగడంపై ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్ర జలు స్వచ్ఛందంగా వ్యాక్సిన్‌ వేసుకోవాలని, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది. మహమ్మారికి బ్రేక్‌ వే సేలా కొవిడ్‌ ఆంక్షలు మరింత కఠినం చేయనున్నారు. 

Updated Date - 2021-04-14T17:13:08+05:30 IST