కోవిడ్ ఆ ధైర్యన్నిఇచ్చిoది

ABN , First Publish Date - 2020-12-27T06:14:09+05:30 IST

‘జీవితంలో దేన్నీ అతిగా ఆశించకూడదనేది మా సిద్ధాంతం. జీవితం ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. అతిగా ఆశిస్తే అశాంతి, నిరాశ తప్పవనిపిస్తుంది.

కోవిడ్ ఆ ధైర్యన్నిఇచ్చిoది

ఒకరు ఒకప్పటి సూపర్‌ స్టార్‌ కృష్ణ గారాల కూతురు. ప్రస్తుత సూపర్‌స్టార్‌ మహే్‌షకు అక్క. 

మరొకరు మహే్‌షకు భార్య.  

ఇద్దరూ వరుసకు ఆడపడచు, మరదలు మాత్రమే కాదు 

మంచి స్నేహితులు కూడా. 

వారే మంజుల, నమ్రతలు. వారు తమ లాక్‌డౌన్‌ అనుభవాలు, 2021పై తాము పెట్టుకున్న ఆశలను ‘నవ్య’తో పంచుకున్నారు. ఆ విశేషాల్లోకి వెళితే...


‘‘జీవితంలో దేన్నీ అతిగా ఆశించకూడదనేది మా సిద్ధాంతం. జీవితం ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. అతిగా ఆశిస్తే అశాంతి, నిరాశ తప్పవనిపిస్తుంది. అందుకే మేము చాలా సంతృప్తిగా ఉంటాం. మాకు పెద్ద అవసరాలు కూడా ఉండవు. మహే్‌షకు టీవీ, కొన్ని ఓటీటీలు ఉంటే చాలు. వాటితో గడిపేస్తాడు. ఇక గౌతమ్‌ సిగ్గరి. తన పని తాను చేసుకుంటాడు. ఎవరితోనూ ఎక్కువగా కలవడు.’’


గత 9 నెలలు ఎలా గడిచాయి? లాక్‌డౌన్‌లో మీ అనుభవాలేమిటి?

మంజుల:  మిశ్రమ అనుభవాలని చెప్పాలి. ఫ్యామిలీతో గడిపేందుకు సమయం చిక్కింది. కానీ అదే సమయంలో మనం జీవితంలో చిన్నవి అనుకొనే విషయాలు కూడా కొన్నిసార్లు చాలా కష్టమవుతాయని అర్థమయింది. ఉదాహరణకు ఒకప్పుడు సినిమాలకు వెళ్లడం, బయటకు వెళ్లడం  చాలా సామాన్యమైన విషయాలు. కానీ కొవిడ్‌ వల్ల ఎక్కడికి వెళ్లలేం అనే కఠినమైన విషయం తెలిసింది. నా వరకూ అయితే అస్సలు ఖాళీ లేకుండా గడిపా! నేను చేయాలనుకున్న పనులన్నీ చేశా!


నమ్రత: నా స్నేహితులందరూ లాక్‌డౌన్‌ వారి జీవితాల్లో తీసుకువచ్చిన పెనుమార్పులను చెబుతున్నారు. చాలామంది తాము ఇళ్లలో ఎలా ఇరుక్కుపోయారో.. పిల్లలు స్కూళ్లకు వెళ్లలేకపోవడాన్ని.. సోషల్‌ లైఫ్‌ ఎలా మిస్‌ అవుతున్నారో చెబుతున్నారు. అయితే గత తొమ్మిది నెలలు మా జీవితంలో ఇలాంటి పెను మార్పులేమి తీసుకురాలేదు. మహే్‌ష ఇంట్లోనే ఉన్నాడు. గౌతమ్‌, సితారల రొటీన్‌ కొనసాగింది. మీకు ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. సాధారణంగా మేము పార్టీలు, ఇతర సోషల్‌ ఫంక్షన్‌కు వెళ్లం. ఇంట్లోనే గడపటానికి ఆసక్తి చూపిస్తాం. అందువల్ల మాకు పెద్ద తేడా అనిపించలేదు. అయితే మా ఇంట్లో పనిచేసేవాళ్లు చాలా కష్టపడ్డారు. అనేక మంది జీవనోపాధి  కోల్పోయారు. అలాంటి వారి అనుభవాలు వింటూ ఉంటే భయమేస్తుంది. 


 మీరిద్దరూ వర్కింగ్‌ మదర్స్‌.. టీనేజ్‌ పిల్లలు కూడా ఉన్నారు.. వీరిని ఎలా మేనేజ్‌ చేశారు?

మంజుల: పేరెంటింగ్‌ అనేది చాలా కష్టం.. అదే సమయంలో చాలా సులభం కూడా. ఒకరికి కష్టమైన అంశం.. మరొకరికి సులభం కావచ్చు. పిల్లలు సాధారణంగా తమ తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటూ ఉంటారు. ఉదాహరణకు నేను, మహేష్‌, మా అక్క అమ్మనాన్నను చూసే అనేక విషయాలు నేర్చుకున్నాం. వారి నడవడిక ఆధారంగా ప్రతి రోజు ఒక కొత్త పాఠం నేర్చుకొనేవాళ్లం. ఎవరితో ఎలా మాట్లాడాలి? బయటకు వెళ్లినప్పుడు ఎలా ప్రవర్తించాలి! అని వాళ్లు వేరుగా చెప్పాల్సిన అవసరం లేకుండా చూసి నేర్చుకున్నాం. మన ఇళ్లలో పిల్లలు కూడా అంతే! నా చిన్నప్పుడు నాలో తిరుగుబాటు ధోరణి ఎక్కువగా ఉండేది. అమ్మమ్మతో చిన్న విషయాలకు కూడా పోట్లాడేదాన్ని. ఇప్పుడు జాను కూడా అంతే! ఇదొక సర్కిల్‌.. అయితే జాను లాక్‌డౌన్‌ సమయంలో గ్యాడ్జెట్స్‌ ఎక్కువగా వాడటం మొదలుపెట్టింది. ఫోన్‌, ల్యాప్‌టాప్‌, వీడియోగేమ్స్‌.. వీటితో ఎంగేజ్‌ అయిపోయింది. ఫిజికల్‌ యాక్టివిటీ తగ్గిపోయింది. నా చిన్నప్పుడు ఇంటర్నెట్‌ లేదు. వైఫై లేదు. ఇన్ని రకాల గ్యాడ్జెట్స్‌ లేవు. ఫిజికల్‌ యాక్టివిటీ ఎక్కువ ఉండేవి. ఇప్పటి పిల్లలకు డిజిటల్‌ యాక్టివిటీనే ఎక్కువుంటోంది. ఫిజికల్‌ యాక్టివిటీ పెరగాలని జాను వెంటపడుతూనే ఉంటా. కొత్త సంవత్సరంలోనైనా తను డిజిటల్‌ యాక్టివిటీ తగ్గిస్తుందని ఆశిస్తున్నా!


నమ్రత:  మంజు చెప్పింది అక్షర సత్యం. తల్లిదండ్రుల నుంచే పిల్లలు విలువలు నేర్చుకుంటారు. మనం పాటించే విలువలన్నీ మన తల్లితండ్రుల నుంచి వచ్చినవే! అయితే ఏ ఇద్దరు పేరెంట్స్‌ ఒకేలా ఉండరు. దీనిలో మంచి, చెడు అనేవి ఉండవు. ఉదాహరణకు కొందరు పేరెంట్స్‌ గ్యాడ్జెట్స్‌ ఎక్కువగా వాడటం తప్పు అనుకోవచ్చు. మరి కొందరు వీటి వల్ల పిల్లల్లో సృజనాత్మకత, క్రియాశీలత పెరుగుతుందనుకోవచ్చు. యాప్స్‌నే తీసుకుందాం. వాటిని భవిష్యత్తులో తయారుచేయాల్సింది ఇప్పటి తరంవారే కదా! అయితే పిల్లల శక్తి సామర్థ్యాలను గుర్తించి వారిని ప్రోత్సహిస్తే మంచిది. సితారకు నేను డ్యాన్స్‌, యాక్టింగ్‌, స్విమ్మింగ్‌లాంటి రకరకాల యాక్టివిటీస్‌ నేర్పిస్తున్నా. నా ఉద్దేశం ఏమంటే... మనం పిల్లలను ప్రొత్సహించగలం. వారికి ఒక మార్గాన్ని చూపించగలం. అవకాశాలు కల్పించగలం. ఆ తర్వాత జీవితాన్ని అందిపుచ్చుకోవాల్సింది వాళ్లే!


  మీరిద్దరూ ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు?

మంజుల: ఈ మధ్యకాలంలో ఆర్గానిక్‌ బిజినె్‌సలోకి ప్రవేశించా. దీని వల్ల అస్సలు ఖాళీ ఉండటం లేదు. ఖాళీ సమయంలో యోగా, ధ్యానం చేస్తూ ఉంటా! 


నమ్రత: నేను టీవీ ఎక్కువగా చూస్తా! నాన్‌ఫిక్షన్‌ పుస్తకాలు చదువుతా! నాకు బయోగ్రఫీలంటే చాలా ఇష్టం. వీటితో పాటుగా ఇంటిని శుభ్రంగా పెట్టుకోవడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తా! ఏ గది ఎలా ఉంది? అని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటా!


మంజుల: నమ్రత ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుంటుంది. ప్రతి గది అద్దంలా మెరిసిపోతూ ఉంటుంది. ప్రతి రూమ్‌లోనూ లెమన్‌గ్రాస్‌ ఉంటుంది. దాంతో ఇంట్లోకి వెళ్లిన వెంటనే మంచి వాసన వస్తూ ఉంటుంది. ఒక పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ ఉంటాయి. ఈ విషయంలో తనను 

మెచ్చుకోవాలి.


నమ్రత: ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే- మన ఆలోచనలు అంత స్పష్టంగా ఉంటాయని నేను నమ్ముతా! అంతేకాదు నా ఉద్దేశంలో నిజమైన ఆనందం డబ్బులు, ఆస్తులు వల్ల రాదు. మంచి కుటుంబం ఉండి.. అందరూ ఆనందంగా ఉంటే వచ్చే సంతృప్తికి ఏదీ సాటిరాదు. జీవించడానికి మనకు కావాల్సినవి లభిస్తే చాలు! ఆ తర్వాత ఎంత వచ్చినా ఒకటేనని నా నమ్మకం. 


 కొత్త సంవత్సరం ఎలా ఉంటుందనుకుంటున్నారు? ఎలా ఉండాలని కోరుకుంటున్నారు?

మంజుల: కొవిడ్‌ మనకు చాలా పాఠాలు నేర్పింది. అదే సమయంలో మనకు మానసిక సైర్థ్యాన్ని కూడా ఇచ్చింది. సమస్యలు ఎదురవ్వకపోతే పరిష్కారాలు ఎలా దొరుకుతాయి? కొవిడ్‌ వచ్చిందని ఆందోళన పడినా, దానికి వ్యాక్సీన్‌ను వెంటనే కనిపెట్టగలిగాం. త్వరలోనే అది అందరికీ అందుతుంది కూడా! అంటే కరోనా మహమ్మారిని వంటి సమస్య వచ్చినప్పుడు దానిని మనం జయించగలిగాం. ఈ కోణం నుంచి చూస్తే కొత్త సంవత్సరం చాలా ఆశాజనకంగా కనిపిస్తోంది. ఎలాంటి సమస్య వచ్చినా- దానిని తట్టుకొని నిలబడగలమన్న ధైర్యాన్ని ఇస్తోంది. 


నమ్రత: కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉంటాయి. కొన్ని ఉండవనే సత్యాన్ని కొవిడ్‌ మనకు నేర్పింది. సమస్యలు ఎదురయినప్పుడు వాటికి పరిష్కారాలు కనిపెట్టగలమనే ధైర్యాన్ని ఇచ్చింది. వ్యాక్సీన్‌ కూడా వచ్చేస్తుందంటున్నారు. మళ్లీ పిల్లలు స్కూళ్లకు వెళతారు. అందరికీ పనులు మళ్లీ ప్రారంభమవుతాయి.. కొత్త సంవత్సరం కొత్తగా ఉంటుందనిపిస్తోంది.

 సివిఎల్‌ఎన్‌


‘‘మనకు ఇష్టం ఉన్నా.. లేకపోయినా మన సమాజంలో ఇంకా కొంత మహిళా వివక్ష ఉంది. ఇది పోవాలంటే ఆడపిల్లలకు కూడా అవకాశాలు కల్పించాలి. మగపిల్లలతో సమానంగా చూడాలి.’’


‘‘వేసుకోవటానికి కొన్ని బట్టలు.. ఉండటానికి ఒక ఇల్లు.. రాత్రి పడుక్కొవటానికి ఒక మంచం.. ఉంటే చాలనేది నా సిద్ధాంతం. నేను ఈ మొత్తం లాక్‌డౌన్‌ సమయమంతా రెండు పైజమాలతో గడిపేసా.. సితార కూడా రెండు జతలతో 

గడిపేసింది..’’ 

- నమ్రత


సమస్యలు ఎదురవ్వకపోతే పరిష్కారాలు ఎలా దొరుకుతాయి? కొవిడ్‌ వచ్చిందని ఆందోళన పడినా, దానికి వ్యాక్సీన్‌ను వెంటనే కనిపెట్టగలిగాం. సమస్య వచ్చినప్పుడు దానిని మనం జయించగలిగాం. 

- మంజుల

Updated Date - 2020-12-27T06:14:09+05:30 IST