హోమియోతో కొవిడ్‌ ఖేల్‌ ఖతం!

ABN , First Publish Date - 2020-11-10T06:15:27+05:30 IST

వైరస్‌ ద్వారా వచ్చే సాంక్రమిక వ్యాధులకు హోమియోలో చాలా కాలం నుంచి చికిత్స ఉంది. 1800ల నాటికే ఎన్నో రకాల

హోమియోతో కొవిడ్‌ ఖేల్‌ ఖతం!

వ్యాధిని తొక్కిపెట్టి ఉంచితే, ఏదో ఒకనాడు తిరగబెడుతుంది!అలాకాకుండా వ్యాధిని సమూలంగా నాశనం చేస్తే, శాశ్వతంగా అంతరిస్తుంది! ఈ సూత్రం ఆధారంగానే హోమియో వైద్య విధానం పనిచేస్తుంది. అయితే కొత్తగా వచ్చే కొవిడ్‌లాంటి సాంక్రమిక వ్యాధుల మాటేమిటి? వీటికి హోమియో చికిత్స ఉందా? అనే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి. కోవిడ్‌కు కూడా హోమియోలో చికిత్స ఉందని.. ఇది కోవిడ్‌కు తాత్కాలికంగా కాకుండా సత్వరంగా.. సమర్థంగా.. శాశ్వత ఫలితాలను ఇస్తుందంటున్నారు హోమియో వైద్య నిపుణులు డాక్టర్‌ అంబటి సురేంద్ర రాజు.


వైరస్‌ ద్వారా వచ్చే సాంక్రమిక వ్యాధులకు హోమియోలో చాలా కాలం నుంచి చికిత్స ఉంది. 1800ల నాటికే ఎన్నో రకాల వైరస్‌లకు హోమియోలో మందులు రూపొందాయి. ఈ రెండు వందల ఏళ్లలో దాదాపు అన్ని రకాల వైరస్‌ కారక వ్యాధులన్నిటినీ హోమియో సమర్థమైన మందులతో నయం చేయగలిగింది. ఈ విషయాలను ధ్రువీకరించే డాటా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. కలరా, ప్లేగు, డెంగ్యూ, ఎల్లో ఫీవర్‌, డిఫ్తీరియా, న్యుమోనియా మొదలైన వ్యాధులన్నీ హోమియో వైద్యంతో నయమయ్యాయి. ఇన్ని మహమ్మారులను నయం చేసిన హోమియోకు కరోనానూ నయం చేసే శక్తి ఉంది. 


లక్షణాలే ఆధారంగా!

హోమియోలో ఏ వ్యాధికైనా వ్యక్తి తత్వం, లక్షణాల ఆధారంగా చికిత్సను చేస్తారు. కొవిడ్‌కు కూడా అంతే! అందుకే కొవిడ్‌ వ్యాధి లక్షణాలతో పాటు.. ఊపిరితిత్తుల సిటి స్కాన్‌లను పరిశీలించాల్సి ఉంటుంది. ఒకసారి వ్యాధి తీవ్రతను నిర్ధారించుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా చికిత్స ప్రారంభించవచ్చు. కొవిడ్‌ చికిత్సకు సూచించే మందులు ప్రధానంగా ఆరు రకాలుగా ఉంటాయి. లక్షణాలు, ఇతర అంశాల ఆధారంగా వీటిలో ఒక మందును సూచిస్తాము. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. అల్లోపతి మందుల వల్ల కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి.


కానీ హోమియో మందుల వల్ల అలాంటి సమస్యలు ఉండవు. ప్రస్తుతం కొవిడ్‌ వచ్చిన వారికి బ్రయోనియా ఆల్బ్‌ -200 అనే మందును ఎక్కువగా సూచించటం జరుగుతోంది. దీని వల్ల కరోనా తాలూకు జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు లాంటి లక్షణాలు అదుపులోకి వస్తాయి. కొందరిలో ఈ లక్షణాలు- న్యూమోనియా,ఉబ్బసం వంటి వ్యాధులకు దారితీస్తాయి. అప్పుడు వారికి వేరే మందును సూచిస్తాము. ఆర్సెనికం ఆల్బం - 30, ఇన్‌ఫ్లూయింజినం - 30- ఈ రెండు మందులూ నెలకు మూడు రోజుల పాటు వాడితే ఎటువంటి సమస్యలు రావు. 


ముల్లును ముల్లుతోనే...

ముల్లును ముల్లుతోనే తీయాలంటారు. హోమియో వైద్య విధానంలో అదే జరుగుతుంది. హోమియో వైద్య విధానంలో- సారూప్య విధాన చికిత్సా పద్ధతి ఉంటుంది. అంటే వ్యాధి లక్షణాలను మరిపించే విధంగా తీవ్రమైన లక్షణాలు ఏర్పడతాయి. ఫలితంగా సహజసిద్ధంగా సోకిన వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పట్టి అంతరించిపోతాయి. ఇందుకు కారణం హోమియో మందులతో బాధితుల్లో తయారయ్యే లక్షణాలు వ్యాధికారక లక్షణాల కంటే బలంగా ఉండడమే! ఈ చికిత్సా విధానంతో వ్యాధి సమూలంగా నాశనం అవడంతో పాటు, మరోసారి తిరగబెట్టే సమస్య కూడా తప్పుతుంది. హోమియో వైద్య చికిత్సా విఽధానం సూత్రం ఇదే!




సత్వర ఫలితాలు..

హోమియో పట్ల అర్థం లేని అవాస్తవాలు, అపోహలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. హోమియో కేవలం దీర్ఘకాలిక రోగాలను మాత్రమే తగ్గిస్తుందనే భావన కూడా చాలా మందిలో ఉంది. నిజానికి ఈ వైద్య విధానం అల్లోపతి కంటే సమర్థంగా, సత్వరంగా ప్రభావాన్ని చూపించగలదు. తీవ్ర జ్వరం, విరేచనాలు, వాంతులు, కళ్లు తిరగడం, అధిక రక్తపోటు మొదలైనవి కూడా హోమియో మందులతో త్వరితంగా అదుపులోకి వస్తాయి.


కొవిడ్‌ వచ్చి తగ్గిన వారిలో మళ్లీ తిరిగి ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ తరహా ఇన్‌ఫెక్షన్లను లాంగ్‌ కొవిడ్‌ అంటారు. అల్లోపతి వైద్య విధానంలో కొవిడ్‌కు వైద్యం చేయించుకున్న తర్వాత మళ్లీ వ్యాధి తిరగబెడితే దానికి కూడా మందులు ఉన్నాయి. వీటిని వాడటం ద్వారా కొవిడ్‌ను శాశ్వతంగా పారద్రోలవచ్చు. 




మరో రూపం..

ఒక వ్యాధిని సమూలంగా నయం చేయకపోతే, అది శరీరంలో అంతర్గతంగా నిద్రాణంగా దాగి, ఏళ్ల తర్వాత మరో వ్యాధి రూపంలో బయల్పడుతుంది. దీనికి ఒక ఉదాహరణ చెబుతాను. చాలా కాలం క్రితం నేను 75 ఏళ్ల ఒక వ్యక్తికి చికిత్స చేయటం మొదలుపెట్టాను! ఆయన ఉబ్బసంతో బాధపడుతున్నానని నా వద్దకు వచ్చారు. ఆయన గత చరిత్ర పరిశీలిస్తే- యుక్తవయస్సులో ఆయనకు గనేరియా జబ్బు సోకిందని తేలింది.


అయితే ఆ లక్షణాలు తగ్గినట్లు కనిపించినా- శరీరంలో వాటి తాలుకు ఆచూకి ఎక్కడో ఉండిపోయింది. అది మరో రూపం దాల్చి ఉబ్బసంలా బయటకు వచ్చింది. గనేరియా జబ్బు లక్షణాలు వచ్చేలా చేస్తే- ఆ వ్యాధితో పాటుగా ఉబ్బసం కూడా తగ్గిపోతుందనేది నా సిద్ధాంతం. మొదట ఆయన వెనకాడినా చివరకు అంగీకరించారు. గనేరియాకు చికిత్స చేయటం వల్ల.. ఈ వ్యాధి శాశ్వతంగా తొలగిపోయింది. దానితో పాటుగా ఉబ్బసం కూడా తగ్గింది. 




వ్యాధినిరోధకశక్తి పెరగాలంటే?

కోవిడ్‌ మాత్రమే కాదు.. ఎలాంటి వైరస్‌ను ఎదుర్కోవాలన్నా రోగనిరోధక శక్తి అవసరం. అయితే రోగనిరోధక శక్తి తగినంత ఉండాలంటే- మనం తినే ఆహారపదార్థాలు కలుషితం లేనివై ఉండాలి. కేవలం ఆహారం మాత్రమే సరిపోదు. మనం తాగే నీరు, పీల్చే గాలి- అన్నీ పరిశుభ్రంగా ఉండాలి. పట్టణాలలో నివసించే వారు తమ చుట్టూ ఉన్న పర్యావరణాన్ని మార్చలేరు కాబట్టి.. ఆహారం విషయంలో ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి. రసాయనాలు లేని ఆహారపదార్థాలు తినటం మంచిది. 




మధుమేహులకు కూడా.. 

హోమియో మందులు తీయగా ఉంటాయి కాబట్టి వాటిని మధుమేహం ఉన్నవారు వేసుకోకూడదనే అపోహ ఒకటి ప్రచారంలో ఉంది. కానీ ఇది నిజం కాదు. ఈ మందుల్లో తీపి ల్యాక్టోజ్‌ వల్ల వస్తుంది. గ్లూకోజ్‌ వల్ల తీపి వస్తే అది మధుమేహులకు ప్రమాదం అవుతుంది. అందువల్ల అందరూ నిరభ్యంతరంగా హోమియో మందులు వాడవచ్చు.


డాక్టర్‌ అంబటి సురేంద్ర రాజు

హోమియో  వైద్య నిపుణులు,

క్యూర్‌ హోమియో క్లినిక్‌,

హైదరాబాద్‌.

Updated Date - 2020-11-10T06:15:27+05:30 IST