Abn logo
May 28 2020 @ 13:02PM

ప్రభుత్వాస్పత్రి నుంచి కోవిడ్ పాజిటివ్ పేషెంట్ అదృశ్యం

కర్నూలు: ప్రభుత్వాస్పత్రి నుంచి కోవిడ్ పాజిటివ్ పేషెంట్ అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆదోని పట్టణానికి  చెందిన 64 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ నెల 23న బాధితురాలిని ఆదోని నుంచి కర్నూల్ కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వార్డులో నుంచి కరోన బాధితురాలు అదృశ్యమైంది. ఆమె కోసం కర్నూల్ బస్టాండ్ , రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.


Advertisement
Advertisement
Advertisement