పరీక్షల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2020-09-21T06:48:51+05:30 IST

కేయూ పరిధిలో సోమవారం నుంచి డిగ్రీ ఆరో సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభమవుతున్న దృష్ట్యా విద్యార్థులు, పరీక్షల అధికారులు

పరీక్షల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ మహేందర్‌రెడ్డి 


కేయూ క్యాంపస్‌, సెప్టెంబరు 20: కేయూ పరిధిలో సోమవారం నుంచి డిగ్రీ ఆరో సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభమవుతున్న దృష్ట్యా విద్యార్థులు, పరీక్షల అధికారులు కరోనా నిబంధనలు పాటించాలని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ ఎస్‌.మహేందర్‌రెడ్డి కోరారు. ఈమేరకు ఆదివారం విద్యార్థులు, చీప్‌ సూపరింటెండెంట్లకు పరీక్షల విధి విధానాలను వివరించారు.


విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్ద గుమిగూడొద్దని, థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేయించుకోవాలని, మాస్కు ధరించాలని స్పష్టం చేశారు. అనారోగ్యంతో ఉన్న విద్యార్థులు చీఫ్‌ సూపరింటెండెంట్లను సంప్రదించాలని కోరారు. అలాగే చీఫ్‌ సూపరింటెండెంట్లు ఎగ్జామ్‌ హాళ్లు, బల్లలను శానిటైజేషన్‌ చేయించాలని, జబ్బు పడిన విద్యార్థులకు తగిన చికిత్స అందించాలని, పరీక్షల విధులకు హాజరయ్యే సిబ్బంది హెల్త్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2020-09-21T06:48:51+05:30 IST