‘నిబంధనలు పాటించండి.. టీకా వేసుకోండి’

ABN , First Publish Date - 2021-04-11T16:01:21+05:30 IST

జిల్లాలో కరోనా నియంత్రణ చర్యలు ముమ్మరం చేశామని, ప్రజలు ప్రభుత్వ నిబంధనలు పాటించడంతో పాటు కరోనా టీకా వేసుకోవా

‘నిబంధనలు పాటించండి.. టీకా వేసుకోండి’



వేలూరు(చెన్నై): జిల్లాలో కరోనా నియంత్రణ చర్యలు ముమ్మరం చేశామని, ప్రజలు ప్రభుత్వ నిబంధనలు పాటించడంతో పాటు కరోనా టీకా వేసుకోవాలని జిల్లా కరోనా నియంత్రణ పనుల ఇన్‌ఛార్జి రాజేష్‌లఖానీ కోరారు. స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం కరోనా నియంత్రణ చర్యలపై వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్షాసమావేశంలో పాల్గొన్న రాజేష్‌లఖానీ మాట్లాడుతూ, జిల్లాలో 45 ఏళ్లు పైబడిన వారికి, ఉపాధి హామీపథక కార్మికులు, కాయగూరలు, పూల వ్యాపారులు, బస్సు, లారీ డ్రైవర్లు, కండక్టర్లు, క్లీనర్లు, హోటళ్లలో పనిచేసే కార్మికులు, కర్మాగారాల్లో పనిచేస్తున్న వారు ఈనెల 25వ తేదీలోపు తప్పకుండా కరోనా టీకా వేసుకోవాలన్నారు. జిల్లాలోని 46 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 10 నగర ప్రాంత ఆరోగ్య కేంద్రాలు, గుడియాత్తం, పేర్నాంబట్టు, అనైకట్టు పెండెలెంట్‌ ప్రభుత్వాస్పత్రుల్లో కరోనా టీకాలను ప్రజలు ఉచితంగా వేయించుకోవచ్చన్నారు. వేలూరు కార్పొరేషన్‌ పరిధిలోని 8 ప్రాంతాల్లో సంచార వాహనాల ద్వారా కరోనా టీకాలు వేసే చర్యలు చేపట్టామన్నారు. కరోనా వైరస్‌ కట్టడి చేసేలా నిబంధనలు పాటించకుండా మాస్కు లేకుండా తిరిగే పాదచారులు, ద్విచక్రవాహనదారుల నుంచి జరిమానా వసూలు చేస్తామని, నిబంధనలు పాటించని దుకాణాలకు జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో రూరల్‌ అభివృద్ధి పథక డైరెక్టర్‌ మాలతి, పారిశుఽఽధ్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ యాస్మిన్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మణివన్నన్‌, కలెక్టర్‌ పీఏ విజయరాఘవన్‌, మహిళా పథక డైరెక్టర్‌ సెంథిల్‌కుమార్‌ సహా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-11T16:01:21+05:30 IST