32వేల మందికి కొవిడ్‌ లక్షణాలు

ABN , First Publish Date - 2022-01-28T06:01:49+05:30 IST

కరోనా మహమ్మారి నియంత్ర ణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే ఈ నెల 28వ తేదీతో ముగియనుంది. ఉమ్మడి జిల్లాలో ఈనెల 21న జ్వర సర్వే ప్రారంభమైంది. వైద్య ఆరోగ్యశాఖ, పం చాయతీరాజ్‌ సిబ్బంది సంయుక్తంగా ఈ సర్వే నిర్వహి స్తున్నారు.

32వేల మందికి కొవిడ్‌ లక్షణాలు
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో సర్వే నిర్వహించి కిట్‌ అందజేస్తున్న వైద్య సిబ్బంది

నేటితో ముగియనున్న జ్వర సర్వే

1,062 పాజిటివ్‌ కేసులు నమోదు

కలెక్టర్‌ పమేలాసత్పథికి పాజిటివ్‌

నల్లగొండ అర్బన్‌, నాగార్జునసాగర్‌, మునుగోడు, వేములపల్లి, దేవరకొండ, పెద్దఅడిశర్లపల్లి, కట్టంగూర్‌, వలిగొండ, ఆత్మకూరు(ఎం), హుజూ ర్‌నగర్‌, జనవరి 27: కరోనా మహమ్మారి నియంత్ర ణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే ఈ నెల 28వ తేదీతో ముగియనుంది. ఉమ్మడి జిల్లాలో ఈనెల 21న జ్వర సర్వే ప్రారంభమైంది. వైద్య ఆరోగ్యశాఖ, పం చాయతీరాజ్‌ సిబ్బంది సంయుక్తంగా ఈ సర్వే నిర్వహి స్తున్నారు. జలుబు, జ్వరం, దగ్గు వంటి కొవిడ్‌ లక్షణా లతో బాధపడుతున్న వారిని గుర్తించి ఇంటి వద్దనే మె డికల్‌ కిట్‌ అందజేస్తున్నారు. అదేవిధంగా హోం క్వారం టైన్‌లో ఉండాలని సూచిస్తే వారి ఆరోగ్యపరిస్థితిని పర్య వేక్షిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 9,89,567 ఇళ్లను సర్వే చేసి, 32,157 మందికి కొవిడ్‌ లక్షణాలను గుర్తించారు. కాగా, గురువారం ఒక్కరోజే ఉమ్మడి జిల్లాలో 1,062 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కలెక్టర్‌ పమేలాసత్పథికి పాజిటివ్‌ వచ్చింది. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో 79, మునుగోడులో 17, వేములపల్లిలో 20, కట్టంగూర్‌లో 12, దేవరకొండ డివిజన్‌లో 160 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దే వరకొండలో 39, డిండిలో 17, గుడిపల్లిలో 6, గుర్రంపోడులో 33, కొండమల్లేపల్లిలో 30, బొడ్డుపల్లి, చందంపేట పీహెచ్‌సీ పరిధిలో నాలుగు చొప్పున, మర్రిగూడ మండలంలో 15, పీఏపల్లిలో 13, వీటీనగర్‌లో 5, వలిగొండలో 41, ఆత్మకూరు(ఎం) పీహెచ్‌సీ పరిధిలో 11 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. హుజూర్‌నగర్‌ యూనియ న్‌ బ్యాంకులో ఆరుగురికి, ఏరియా ఆస్పత్రిలో ఏడుగు రికి, అదేవిధంగా మండలంలోని ఓ వైద్యుడు, నలుగురు ఏఎన్‌ఎంలు, ఐదుగురు ఆశాలకు పాజిటివ్‌ వచ్చింది.

Updated Date - 2022-01-28T06:01:49+05:30 IST