గర్భిణులకు కొవిడ్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2020-08-10T09:25:36+05:30 IST

గర్భిణులకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తామని కోసిగి మండలంలో వైద్యాధికారులు ప్రచారం చేశారు. కొసిగి పట్టణంలోని బాలుర ఉత్నత పాఠశాల వద్దకు ఆదివారం ఉదయం రావాలని సూచించారు.

గర్భిణులకు కొవిడ్‌ పరీక్షలు

ఎంత నిర్లక్ష్యం..!

గర్భిణులకు కొవిడ్‌ పరీక్షలు

గంటల తరబడి క్యూలో

నీరు లేదు.. నీడ లేదు


కోసిగి, ఆగస్టు 9:  గర్భిణులకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తామని కోసిగి మండలంలో వైద్యాధికారులు ప్రచారం చేశారు. కొసిగి పట్టణంలోని బాలుర ఉత్నత పాఠశాల వద్దకు ఆదివారం ఉదయం రావాలని సూచించారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు తమ పరిధిలో ఉన్న గర్భిణులను బడిలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ నిర్ధారణ కేంద్రం వద్దకు ఉదయం తొమ్మిది గంటలకు తీసుకువచ్చారు. సుమారు 125 మంది గర్భిణులు ఇలా క్యూలో నిలబడ్డారు.


వైద్యాధికారులు కర్నూలు నుంచి నింపాదిగా 11 గంటలకు వచ్చారు. కొవిడ్‌ పరీక్షల కోసం వచ్చిన వారికి కుర్చీలు ఏర్పాటు చేయలేదు. నీడ కోసం షామియానా వేయలేదు. దీంతో కొందరు నిలబడలేక నేలపై కూర్చుండిపోయారు. కనీసం వారికి తాగునీరు కూడా అందుబాటులో ఉంచలేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. గర్భిణులకు తాము కొవిడ్‌ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తామని, సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత తహసీల్దారు, ఎంపీడీవోలదేనని డాక్టర్‌ కీర్తిప్రియ అన్నారు. తాగునీరు కావాలంటే మీరే ఏర్పాటు చేయండి అని ఆంధ్రజ్యోతి విలేఖరికి ఉచిత సలహా ఇచ్చారు.


ఇబ్బందిగా ఉంది..భారతి, గర్భిణి, కొల్‌మాన్‌పేట

గర్భిణులు నేలపై కూర్చోలేరని తెలిసినా అధికారులు ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు. కనీసం తాగునీరు లేదు. 3 గంటల పాటు ఎండలో ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు.

Updated Date - 2020-08-10T09:25:36+05:30 IST