కొవిడ్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

ABN , First Publish Date - 2021-05-19T05:10:33+05:30 IST

కొవిడ్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

కొవిడ్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి
హెల్త్‌ సెంటర్‌ ఇన్‌చార్జికి వినతిపత్రం అందజేస్తున్న బీజేపీ నేతలు

షాద్‌నగర్‌/మహేశ్వరం/మంచాల: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి న ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో రాష్ట్ర ప్రభుత్వ చేరి పేదలకు వైద్యం అందించాలని షాద్‌నగర్‌ బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. కరోనా రోగుల చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి, ఈ పథకం కింద ఖర్చు పరిమితిని రూ.5లక్షలకు పెంచాలన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి దేపల్లి అశోక్‌గౌడ్‌, డాక్టర్స్‌ సెల్‌ కన్వీనర్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌, తెలంగాణ విమోచన సమితి అధ్యక్షులు శ్రీవర్ధన్‌రెడ్డి మంగళవారం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రిని సందర్శించారు. శ్రీవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ము ఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు షాద్‌నగర్‌లో వంద పడకల ఆస్పత్రిని నిర్మించాలన్నారు. డాక్టర్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ పీహెచ్‌సీల్లో రోజూ కరోనా టెస్ట్‌ల సంఖ్యను 100కు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల సంఖ్యను పెంచాలన్నారు. కార్యక్రమంలో పాలమూరు విష్ణువర్దన్‌రెడ్డి, మురళి, యువమోర్చ వంశీకృష్ణ పాల్గొన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు యాదీష్‌ అన్నారు. మహేశ్వరంలో ఆయన మాట్లాడుతూ కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ఖర్చును రూ.5లక్షలకు పెంచాలన్నారు. ఆసుపత్రుల్లో వసతులు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ బుధవారం ఒ కరోజు దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంట్లోనే ఉంటూ జిల్లాలోని బీజేపీ, బీజేవైఎం కార్యక్తలు దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని రాష్ట్రంలో అమలుచేయాలని మంచాల మండల మాజీ వైస్‌ఎంపీపీ దన్నె భాషయ్య డిమాండ్‌ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఈ పథకాన్ని తెచ్చారన్నారు. మిగతా రాష్ట్రాలన్నీ ఆయుష్మాన్‌ భారత్‌తో పేదలకు సౌకర్య వంతమైన వైద్యాన్ని అందిస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కళ్లుతెరచి ఆయుష్మాన్‌ భారత్‌ను అమలుచేయాలన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు. ఈ సమస్యపై తాము బుధవారం ఒక రోజు దీక్షను బీజేపీ ఆధ్వర్యలో చేపట్టనున్నట్లు వెళ్లడించారు. 

Updated Date - 2021-05-19T05:10:33+05:30 IST