కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2021-01-17T05:45:06+05:30 IST

స్థానిక జిల్లా ఆస్పత్రిలో శనివారం తొలి కొవిడ్‌ వ్యాక్సిన్‌ను జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.కృష్ణారావు వేయించుకున్నారు.

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం
తొలి వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కృష్ణారావు, చిత్రంలో ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, ఫాల్గుణ



పాడేరు, జనవరి 16: స్థానిక జిల్లా ఆస్పత్రిలో శనివారం తొలి కొవిడ్‌ వ్యాక్సిన్‌ను జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.కృష్ణారావు వేయించుకున్నారు. తొలి రోజు 54 మందికి కొవిడ్‌ టీకా వేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాడేరు, అరకు ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ, ఐటీడీఏ పీవో ఎస్‌.వెంకటేశ్వర్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. టీకా వేయించుకున్న వారికి ఎటువంటి రియాక్షన్‌ కాలేదు.  ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యుడు డాక్టర్‌ టి.నరసింగరావు, డీఎస్‌పీ డాక్టర్‌ వీబీ.రాజ్‌కమల్‌, సీఐ పీపీ.నాయుడు, తహసీల్దార్‌ ప్రకాశరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-17T05:45:06+05:30 IST