పిల్లలకు కొవిడ్‌ రక్ష

ABN , First Publish Date - 2021-06-15T08:43:33+05:30 IST

పాండమిక్‌ సమయంలో పిల్లలను కొవిడ్‌ నుంచి రక్షించుకోవడం కోసం ఆయుష్‌ మినిస్ట్రీ కొన్ని మార్గదర్శకాలను సూచిస్తోంది. మాస్క్‌ వాడకం, యోగా సాధన, ఆయుర్వేద ఔషధాలు,

పిల్లలకు కొవిడ్‌ రక్ష

పాండమిక్‌ సమయంలో పిల్లలను కొవిడ్‌ నుంచి రక్షించుకోవడం కోసం ఆయుష్‌ మినిస్ట్రీ కొన్ని మార్గదర్శకాలను సూచిస్తోంది. మాస్క్‌ వాడకం, యోగా సాధన, ఆయుర్వేద ఔషధాలు, న్యూట్రాస్యూటికల్స్‌తో వ్యాధుల నియంత్రణ, టెలికన్సల్టేషన్‌ సౌలభ్యం ఉపయోగించుకోవడంతో పాటు పిల్లలకు కొవిడ్‌ చికిత్సలో అనుసరించవలసిన మరో ఐదు మార్గదర్శకాలను సూచిస్తోంది. అవేంటంటే....


రెమిడెసివిర్‌: 18 ఏళ్ల లోపు పిల్లలకు ఈ ఇంజెక్షన్‌ బధ్రత, పనితీరులను నిర్ధారించే డాటా లేనందున, రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌ను పిల్లల కొవిడ్‌ చికిత్సలో ఇవ్వకూడదు. 

ఆరు నిమిషాల నడక: 12 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న పిల్లలకు మాత్రమే తల్లితండ్రుల పర్యవేక్షణలో ఈ పరీక్ష కొనసాగాలి. 

ఇన్‌ హోం మానిటరింగ్‌: అదుపు తప్పిన ఉబ్బసం కలిగిన పిల్లలకు మినహా, మిగతా పిల్లలకు ఈ పరీక్షను ప్రతి 6 నుంచి 8 గంటలకోసారి చేయవచ్చు.

స్టిరాయిడ్లు: వీటిని సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన సమయం పాటు మాత్రమే వాడాలి.

మాస్క్‌: ఐదేళ్ల లోపు పిల్లలకు మాస్క్‌ అవసరం లేదు. 6 - 11 ఏళ్ల పిల్లలు మాస్క్‌ పెట్టుకోగలిగితే తల్లితండ్రులు వాటిని, పిల్లలు ధరించేలా చూడాలి. 11 ఏళ్ల కంటే పెద్ద పిల్లలు తప్పనిసరిగా మాస్క్‌ పెట్టుకోవాలి.

Updated Date - 2021-06-15T08:43:33+05:30 IST