వీడని వింత వ్యాధి భయం

ABN , First Publish Date - 2021-01-27T05:44:39+05:30 IST

ఏలూరు, పూళ్ల, కొమిరేపల్లి గ్రా మాల్లో మరువక ముందే మళ్లీ దెందులూరు మండలం కొవ్వలి లో రెండు అంతుచిక్కని వ్యాధి కేసులు నమోదవడంతో గ్రామ స్థులు ఉలిక్కిపడ్డారు.

వీడని వింత వ్యాధి భయం
కొవ్వలిలో వివరాలు సేకరిస్తున్న సిబ్బంది

కొవ్వలిలో రెండు కేసులు

అప్రమత్తమైన అధికారులు 

దెందులూరు, జనవరి 26 : ఏలూరు, పూళ్ల, కొమిరేపల్లి గ్రా మాల్లో మరువక ముందే మళ్లీ దెందులూరు మండలం కొవ్వలి లో రెండు అంతుచిక్కని వ్యాధి కేసులు నమోదవడంతో గ్రామ స్థులు ఉలిక్కిపడ్డారు. జిల్లా అధికారులు అప్రమత్తమై పో తునూరు ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో ఆరోగ్య సిబ్బంది. వైద్యులతో వైద్య శిబిరం ప్రారంభించారు. కొవ్వలి కొత్తపే టకు చెందిన మాదాసు ఉగాది సోమవారం రాత్రి వ్యాధి భారిన పడగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా కోలుకున్నాడు. మరో వ్యక్తి మం గళవారం అనారోగ్యం భారిన పడగా వైద్యశిబిరంలో చికిత్స అందించగా కోలుకు న్నాడు. వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. కొమిరేపల్లిలో మొత్తం 33 కేసులు నమోదు కాగా ఏడుగురు మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కొత్తకేసులు నమోదు కాకపోవడంతో  అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. 

Updated Date - 2021-01-27T05:44:39+05:30 IST