Abn logo
Jul 8 2020 @ 15:10PM

కరోనా వ్యాప్తిని అరిక్టేందుకు చర్యలు చేపట్టాం: క్రాంతి రాణా టాటా

తిరుపతి: తిరుపతి నగరంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో రెడ్ జోన్‌లలో లాక్ డౌన్ అమలు తీరును అనంతపురం రేంజ్ డీఐజీ క్రాంతి రాణా టాటా, ఎస్పీ రమేష్ రెడ్డిలు పరిశీలించారు. కరోనా సామాజిక వ్యాప్తిగా ఉండటంతో కంటైన్మెంట్ జోన్ల పరిధిలో లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందికి డీఐజీ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం క్రాంతి రాణా టాటా ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్టు సేకరణలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... కరోనా వ్యాపిని అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. తిరుపతి నగరంలో 40 డివిజన్లలో రెడ్ జోన్లు ఉన్న నేపథ్యంలో పరిమిత సంఖ్యలో జన సంచారం ఉండేలా చర్యలు చేపట్టాలని... సిబ్బందికి ఆదేశాలను జారీ చేశామని క్రాంతి రాణా టాటా తెలిపారు.


Advertisement
Advertisement
Advertisement