Oct 26 2021 @ 16:29PM

మీడియా ముందుకు వచ్చి.. వాళ్లపై నిప్పులు చెరిగిన Sameer Wankhede భార్య క్రాంతి రేడ్కార్..

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తీవ్ర ఆరోపణలు చేశారు. సమీర్ వాంఖడే దొంగ సర్టిఫికెట్‌తో ఉద్యోగం సంపాదించారని, షారూక్ నుంచి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించారని నవాబ్ విమర్శించారు. అంతేకాదు సమీర్ మతం గురించి, తల్లి గురించి, భార్య గురించి కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో సమీర్ భార్య, మాజీ నటి క్రాంతి రాడ్కేర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


`సమీర్ చాలా నిజాయితీపరుడైన వ్యక్తి. అందుకే అతనికి శత్రువులు ఎక్కువ. ప్రస్తుతం నా భర్త ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. నా భర్త ఎలాంటి తప్పూ చేయలేదు. ఈ దాడిని మేం ఎంత మాత్రం ఉపేక్షించమ`ని క్రాంతి హెచ్చరించారు. సమీర్ వాంఖడే అసలు పేరు సమీర్ దావూద్ వాంఖడే అని, తప్పుడు సర్టిఫికెట్‌తో ఉద్యోగం సంపాదించాడని నవాబ్ మాలిక్ ఆరోపించారు. ఆ ఆరోపణలపై క్రాంతి స్పందిస్తూ.. అవి నిరాధారమైన ఆరోపణలని కొట్టిపరేశారు. అలాగే తన పేరు దావూద్ కాదని.. ధన్యదేవ్ అని సమీర్ తండ్రి స్పష్టం చేశారు. 

Bollywoodమరిన్ని...