Abn logo
May 18 2020 @ 22:17PM

పవన్ కోసం క్రిష్ ప్లాన్ మార్చాడట..

పవన్ కల్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్‌సాబ్’, క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా.. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్‌కు బ్రేకులు పడ్డాయి. అన్నీ బాగుండి ఉంటే ఇప్పుడు ‘వకీల్‌సాబ్’ విడుదలై.. క్రిష్ దర్శకత్వంలోని సినిమా షూటింగ్‌లో పవన్ బిజీ అయ్యేవాడు. కానీ అన్నీ తారుమారయ్యాయి. అసలిప్పుడు షూటింగ్స్‌కు ఎప్పుడు అనుమతి ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవేళ అనుమతి ఇచ్చినా.. ఎటువంటి కండీషన్స్ ఉంటాయో తెలియదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే క్రిష్, తను పవన్‌తో చేయబోయే చిత్రానికి ప్లానింగ్ అంతా మార్చేశాడట. 


వాస్తవానికి ఈ చిత్రం చారిత్రాత్మక కథాంశంతో రూపుదిద్దుకోనుందనే వార్తలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. షూటింగ్ కూడా నార్త్ ఇండియాలోని లోకేషన్లలో ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు కాబట్టి.. ఈ సినిమాకు సంబంధించి కావాల్సిన లోకేషన్స్ అన్నింటిని సెట్స్ రూపంలో రామోజీ ఫిల్మ్ సిటీలో వేయించాలనే ప్లాన్‌లో ఉన్నాడట క్రిష్. లాక్‌డౌన్‌కు ముందే ఈ సినిమా కోసం కొన్ని సెట్స్ హైదరాబాద్‌లో వేశారు. ఇప్పుడు దాదాపు 90శాతం షూటింగ్ అంతా సెట్స్‌లోనే చిత్రీకరించాలనే నిర్ణయానికి క్రిష్ వచ్చినట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తుంది. అయితే ఈ వార్తపై క్రిష్ కానీ, నిర్మాతలు కానీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

Advertisement
Advertisement
Advertisement