నవంబర్ 16న వృషభోత్సవం

ABN , First Publish Date - 2020-10-30T02:57:14+05:30 IST

హైదరాబాద్: వేద వ్యవసాయ పండుగల్లో అతి ముఖ్యమైన వృషభోత్సవాన్ని నవంబర్ 16న నిర్వహించనున్నారు.

నవంబర్ 16న వృషభోత్సవం

హైదరాబాద్: వేద వ్యవసాయ పండుగల్లో అతి ముఖ్యమైన వృషభోత్సవాన్ని నవంబర్ 16న నిర్వహించనున్నారు. కార్తీక శుద్ధ పాడ్యమి నాడు ఈ పండుగను నిర్వహిస్తున్నట్లు కృషిభారతం సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. బసవ, పరాశర, పరశురామ, కశ్యప, వశిష్ట, బలరాముడు తదితరులు గతంలో వృషభాన్ని పూజించారని కృషిభారతం సంస్థ వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్ (8686743452, 7095778791) తెలిపారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రతిఏటా వృషభోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 




వ్యవసాయరంగంలో కీలకమైన వృషభాన్ని సంరక్షించుకోవాలని కృషి భారతం పిలుపునిచ్చింది. భారతీయ వృషభాలను కాపాడుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు దేశవాళీ వృషభాలను, ఆవులను అందించగలమని చెప్పారు. దేశవాళీ గోవుల, వృషభాల సంతతిని పెంచే లక్ష్యంతో వృషభోత్సవం నిర్వహిస్తున్నామని కౌటిల్య కృష్ణన్ తెలిపారు. భారతీయ వ్యవసాయ పద్ధతులపై కృషి భారతం పరిశోధనలు చేస్తోంది.

Updated Date - 2020-10-30T02:57:14+05:30 IST