Feb 1 2020 @ 22:01PM

నిరాహారదీక్ష చేసిన కృష్ణ - విజయనిర్మల దంపతులు

అవి ప్రత్యేకాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులు. జై ఆంధ్ర అంటూ కోస్తా, రాయలసీమ ప్రజలు రోడ్లపైకి రావడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. అదే సమయంలో సినీ పరిశ్రమ నుంచి ఉద్యమానికి మద్దతు ప్రారంభమైంది. ఆనాటి అగ్రతారల్లో ఒకరైన సూపర్ స్టార్ కృష్ణ ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అప్పటికి తెలుగు సినీ పరిశ్రమ మద్రాసులో ఉన్న విషయం తెలిసిందే. అక్కడే ఉన్న కృష్ణ.. ఆంధ్రుల ఆకాంక్షలను చాటుతూ.. మద్రాసు నడిబొడ్డున ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. చెన్నైలోని పనగల్ పార్కులో కృష్ణ, విజయనిర్మల దీక్షలో పాల్గొన్నారు. అక్కడి గవర్నర్‌కు మెమరాండం కూడా అందజేశారు. ఈ పక్కనున్న ఫొటో ఆనాటిదే. రాజకీయంగానూ కృష్ణ, విజయనిర్మల జంట ఎంత చురుకుగా ఉంటారో చెప్పడానికి ఇదో ఉదాహరణ.

 

ఇంకో విషయం ఏంటంటే.. అదే సమయంలో కరువు రాష్ట్రాన్ని పట్టిపీడిస్తోంది. కరువు బాధితుల కోసం ఎవరికి తోచిన సాయం వారందిస్తున్నారు. వ్యక్తిగతంగా రూ. 25వేలు కృష్ణ ఇవ్వగా.. మిగిలిన వాళ్ల దగ్గర నుంచి సుమారు రూ. 8 లక్షలు సేకరించి అందించారట. అంతేకాదు బియ్యం తదితరాలు లారీలో ఆంధ్రాకు పంపిచారు.

 

సౌజన్యం: యు. వినాయకరావు గారి రచన ‘దేవుడులాంటి మనిషి’





♬ original sound -bollywood.mirror