Abn logo
May 21 2020 @ 14:09PM

సూపర్‌స్టార్ జన్మదినోత్సవ వేడుకలు రద్దు!

టాలీవుడ్ సీనియర్ హీరో, సూపర్‌స్టార్ కృష్ణ జన్మదినోత్సవ వేడుకలను ఈ నెల 31వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఆయన అభిమానులు సిద్ధమవుతున్నారు. అయితే ఈ ఏడాది తన బర్త్‌డే సందర్భంగా ఎలాంటి వేడుకలు చేసుకోకూడదని కృష్ణ నిర్ణయించుకున్నారు. ఆ మేరకు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. 


ప్రముఖ నటి , నిర్మాత , మహిళా దర్శకురాలు విజయనిర్మల గతేడాది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ 27న తొలి సంవత్సరీకం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సంతాప సూచకంగా కృష్ణ తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి, తన పుట్టిన రోజు వేడుకలను ఎవరూ నిర్వహించవద్దని, ఆ రోజున తనను కలవడానికి ఎవరూ రావొద్దని కృష్ణ విజ్ఞప్తి చేశారు. 

Advertisement
Advertisement
Advertisement