కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఎజెండా పంపిన ఏపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-06-04T00:33:49+05:30 IST

కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఎజెండా ఏపీ ప్రభుత్వం పంపింది. సాగర్ లెఫ్ట్ కెనాల్ నుండి నీటి విడుదలతో ఏపీ ప్రభుత్వం నష్టపోతోందని, కృష్ణా నది యాజమాన్య బోర్డును విజయవాడ

కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఎజెండా పంపిన ఏపీ ప్రభుత్వం

హైదరాబాద్: కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఎజెండా ఏపీ ప్రభుత్వం  పంపింది. సాగర్ లెఫ్ట్ కెనాల్ నుండి నీటి విడుదలతో ఏపీ ప్రభుత్వం నష్టపోతోందని, కృష్ణా నది యాజమాన్య బోర్డును విజయవాడ తరలించాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. కృష్ణానదిపై నిర్మాణం చేపడుతున్న తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వరద జలాలు వచ్చినప్పుడు వాడుకున్న నీటిని లెక్కించవద్దని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.


గురువారం కృష్ణా బోర్డు, శుక్రవారం గోదావరి బోర్డు సమావేశం కానుంది. రేపు ఉదయం 11 గంటలకు జలసౌధలో కృష్ణాబోర్డు సమావేశం అవుతుంది. కృష్ణా బోర్డు భేటీలో ఐదు అంశాలపై చర్చించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎల్లుండి జరిగే గోదావరి బోర్డు సమావేశంలో తెలంగాణపై ఏపీ ప్రభుత్వ ఫిర్యాదు మీద చర్చించే అవకాశం ఉంది. సాగునీటి ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాలు పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో వేర్వేరుగా రెండు బోర్డులు సమావేశం కానున్నాయి. 


Updated Date - 2020-06-04T00:33:49+05:30 IST