Abn logo
Oct 23 2021 @ 03:32AM

శ్రీశైలంలో 25, 26 తేదీల్లో కృష్ణా బోర్డు అధికారుల పర్యటన

హైదరాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): కేంద్రం ఆదేశాలతో ప్రాజెక్టుల స్వాధీనంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి వీలుగా ఈ నెల 25, 26వ తేదీల్లో శ్రీశైలం ప్రాజెక్టు లోని ఆరు నీటి విడుదల వ్యవస్థ లను పరిశీలించడానికి రవి కుమార్‌ పిళ్లై నేతృత్వంలోని కృష్ణా బోర్డు అధికారుల బృందం క్షేత్ర పర్యటనకు వెళ్లనుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లోని తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదు జలవిద్యుత్‌ కేంద్రాలతో పాటు రెండు ఆనకట్టలు సహా 15 నీటి విడుదల వ్యవస్థలను తమ చేతికి అందించాలని కోరుతూ కృష్ణా బోర్డు తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.

క్రైమ్ మరిన్ని...