కృష్ణా జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలు

ABN , First Publish Date - 2021-07-23T16:39:25+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. జిల్లాల్లో రెండ్రోజులుగా ఎడతెరపి లేకుండా వానలు కురవడంతో నగరాలు, గ్రామాలు జలమయమవుతున్నాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి...

కృష్ణా జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలు

కృష్ణా: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. జిల్లాల్లో రెండ్రోజులుగా ఎడతెరపి లేకుండా వానలు కురవడంతో నగరాలు, గ్రామాలు జలమయమవుతున్నాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. అసలే అస్తవ్యస్తంగా ఉన్న రహదారులు మరింత అధ్వానంగా మారాయి. ఈదురు గాలులకు కొన్ని చోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎగువన కరుస్తున్న భారీ వర్షాలకు వత్సవాయి మండలం లింగాల గ్రామం కాజ్వేపైన వరద ప్రవహిస్తుంది. దీంతో ఆంధ్రా నుంచి తెలంగాణకు రాకపోకలు నిలిచిపోయాయి. రాకపోకలు అంతరాయం కలగడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

Updated Date - 2021-07-23T16:39:25+05:30 IST