ఏబీఎన్ ఎఫెక్ట్.. మూసేసిన కొడాలి నాని అడ్డాలోని కేసినో

ABN , First Publish Date - 2022-01-18T17:46:52+05:30 IST

గుడివాడ కేసినోపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు సంచలనం సృష్టించాయి. దీంతో...

ఏబీఎన్ ఎఫెక్ట్.. మూసేసిన కొడాలి నాని అడ్డాలోని కేసినో

కృష్ణా జిల్లా: గుడివాడ కేసినోపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు సంచలనం సృష్టించాయి. దీంతో సోమవారం తెల్లవారు జామున కేసినోకు తెరపడింది. అయితే ఇది తాత్కాలికమేనని, హడావుడి సద్దుమణిగిన తర్వాత మళ్లీ ఆట మొదలవుతుందని నిర్వాహకులు చెబుతున్నట్లు సమాచారం. మంత్రి కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్‌లో భారీ ఎత్తున జూడ క్రీడ సాగుతున్నప్పటికీ స్థానిక పోలీసులు కన్నెత్తి చూడలేదు. స్వయంగా మంత్రికి సంబంధించిన కన్వెన్షన్ హాలు కావడంతో అటువైపు అడుగు వేసేందుకు పోలీసులు సాహసించలేదు. హాలు లోపల, బయట కాపలాగా హైదరాబాద్ నుంచి బౌన్సర్లను గుడివాడకు రప్పించారు.


గోవా కేసినోలను గుడివాడలో దించేశారు. అన్ లిమిటెడ్‌గా మందు, విందు.. ఆనందంగా అమ్మాయిలతో హుషారెత్తించే నృత్యాలు... కేసినో టేబుళ్ల వద్ద గేమ్ నడిపించింది అమ్మాయిలే. ఈ జూద క్రీడకు కర్త, కర్మ ఆ మంత్రేనని చెప్పుకుంటున్నారు. మంత్రి కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్ హాలులోనే ఈ కేసినో నిర్వహించారు.

Updated Date - 2022-01-18T17:46:52+05:30 IST