Abn logo
May 31 2020 @ 12:35PM

కంచికచర్లలో మహిళా కానిస్టేబుల్ మృతి కేసులో కొత్త కోణం

కృష్ణా: జిల్లాలోని కంచికచర్లలో మహిళా కానిస్టేబుల్ మృతి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్‌ నీలవేణిని భర్త నాగశేషు చీరతో గొంతు నులిమి చంపినట్లు తెలిసింది. అతని తమ్ముడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.


కంచికచర్లలోని ఎక్సైజ్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌ హత్యకు గురైంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచికచర్ల ఎక్సైజ్‌ శాఖలో భార్యాభర్తలు పుచ్చకాయల నీలవేణి, నాగశేషు కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. నీలవేణిది కొండపల్లి గ్రామం కాగా, నాగశేషుది చీమలపాడు. వీరిద్దరూ ప్రేమించుకుని పదమూడు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. నాలుగు నెలల క్రితం నీలవేణి ఓ బాబుకు జన్మనిచ్చింది.

Advertisement
Advertisement
Advertisement