పాడిరైతుల సంక్షేమమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-01-28T06:36:33+05:30 IST

పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా కృష్ణామిల్క్‌ యూనియన్‌ పాటుపడుతుందని యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు అన్నారు. అధిక పాలఉత్పతికి దోహదపడేలా పాడి పశువుల కోసం విజయ కాల్‌, విజయ లివ్‌ ఉత్పత్తులను అతితక్కువ ధరకే అందించడం జరుగుతుందన్నారు.

పాడిరైతుల సంక్షేమమే లక్ష్యం
నూతన ఉత్పత్తులను ప్రారంభిస్తున్న చైర్మన్‌ చలసాని ఆంజనేయులు, పాలకవర్గ సభ్యులు

చైర్మన్‌ చలసాని ఆంజనేయులు

విజయ నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ

చిట్టినగర్‌, జనవరి 27: పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా కృష్ణామిల్క్‌ యూనియన్‌ పాటుపడుతుందని యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు అన్నారు. అధిక పాలఉత్పతికి దోహదపడేలా పాడి పశువుల కోసం విజయ కాల్‌, విజయ లివ్‌ ఉత్పత్తులను అతితక్కువ ధరకే అందించడం జరుగుతుందన్నారు. విజయ డెయిరీ నూతన ఉత్పత్తులు విజయ కాల్‌(కాల్షియం), విజయ-లివ్‌(లివర్‌ టానిక్‌)లను గురువారం పాలఫ్యాక్టరీ సమావేశపు హాలులో పాలకవర్గం ఆవిష్కరించింది. ఈ సందర్భంగా చలసాని మాట్లాడుతూ, చిన్న, సన్నకారు రైతులకు ఆర్ధికంగా చేయూత నిచ్చేలా అధిక సబ్సిడీకి విజయ-కాల్‌, విజయ-లివ్‌ అందించడం జరుగుతుందన్నారు.

కాల్షియం లీటరు మార్కెట్లో రూ 244ఉండగా రూ. 77కి, అలాగే లివర్‌ టానిక్‌ మార్కెట్లో రూ 210 ఉండగా దానిని రూ 80కి కేవలం తమ రైతులకు మాత్రమే అందించడం జరుగుతుందన్నారు. నాణ్యతా ప్రమాణాలతో పాల దిగుబడి పెంచేలా విజయ కాల్‌, విజయ లివ్‌ను రైతులకు అందుబాటులో తీసుకురావడం జరిగిందన్నారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే పాల ఉత్పత్తి గణనీయంగా 17శాతం పెరిగిందన్నారు. కార్యక్రమంలో ఎండి కొల్లి ఈశ్వరబాబు, పాలకవర్గ సభ్యులు వేమురిసాయి వెంకటరమణ, దాసరి బాలవర్ధనరావు, వూయ్యూరి అంజిరెడ్డి, చలసాని చక్రపాణి, ఆర్జి వెంకట నగేష్‌, కాసరగడ్డ గురవయ్య, పల్లగాని కొండలరావు, బొట్టు రామచంద్రరరావు, పులి వెంకరత్నం, కోకా వెంకటేశ్వరరావు, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-28T06:36:33+05:30 IST