Abn logo
Mar 5 2021 @ 11:35AM

‘దినమలర్‌’ మాజీ ఎడిటర్‌ కృష్ణమూర్తి కన్నుమూత

చెన్నై/అడయార్‌ : ప్రముఖ తమిళ దినపత్రిక ‘దినమలర్‌’ పూర్వ సంపాదకులు, షేర్‌హోల్డర్‌ డాక్టర్‌ ఆర్‌.కృష్ణమూర్తి గురువారం కన్నుమూశారు. ఈయన వయసు 88 యేళ్ళు. దాదాపు 40 యేళ్ళకుపైగా ‘దినమలర్‌’ పత్రికకు సంపాదకులుగా పనిచేశారు. కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోయిల్‌ సమీపంలోని వటివీశ్వరం అనే గ్రామంలో ఆయన 1933 సంవత్సరం జనవరి 18వ తేదీన జన్మించారు. ఈయన తండ్రి టీవీ రామసుబ్బయ్య తదనంతరం ‘దినమలర్‌’ సంపాదకులుగా బాధ్యతలు స్వీకరించి, ఆ పత్రికను సమున్నత స్థానానికి తీసుకొచ్చారు.

Advertisement
Advertisement
Advertisement