నూజివీడు ఘటన నిందితుడి అరెస్ట్

ABN , First Publish Date - 2020-02-28T14:12:31+05:30 IST

నూజివీడు ఘటన నిందితుడి అరెస్ట్

నూజివీడు ఘటన నిందితుడి అరెస్ట్

నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు ఘటన నిందితుడు ఆటోడ్రైవర్ అని పోలీసులు తేల్చారు. నిందితుడు అన్నం వెంకటేశ్వరరావు(35)ను అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశ్వరరావును పట్టుకోవడంలో బిర్యానీ పొట్లం పోలీసులకు కీలకం అయ్యింది. ఈ ఘటనకు ముందు స్థానిక హోటల్ నుంచి వెంకటేశ్వరరావు బిర్యానీ తెచ్చుకున్నాడు. ఘటనా స్థలిలో బిర్యానీ కవర్ పోలీసులకు దొరికింది. ఈ కవర్ ఆధారంగా హోటల్‌కు వెళ్లిన పోలీసులు వివరాలు అడిగి తెలుసుకుని నిందితుడు అన్నం వెంకటేశ్వరరావును పట్టుకున్నారు. నిందితుడి ఇంట్లో బట్టలు, సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.


నూజివీడుకు చెందిన ఓ బాలిక తన తండ్రిని వెతుక్కుంటూ ట్రిపుల్ ఐటీ సమీపానికి వచ్చింది. ఈ సమయంలో సైకిల్‌పై వచ్చిన ఓ దుండగుడు బాలికకు మాయమాటలు చెప్పాడు. సైకిల్‌పై ఎక్కించుకుని ట్రిపుల్ ఐటీ వెనుకకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఏడుస్తున్న బాలికను గమనించిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు. సీసీఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అన్నం వెంకటేశ్వరరావుగా గుర్తించారు. వెంటనే అతడి ఆచూకీ కనుగొని అరెస్ట్ చేశారు. 

Updated Date - 2020-02-28T14:12:31+05:30 IST