Oct 22 2021 @ 21:46PM

రెబల్ స్టార్ ఇంట్లో సర్వంట్‌కి సత్కారం

25 సంవత్సరాలుగా తమ ఇంట్లో సర్వంట్‌గా చేస్తున్న పద్మ‌ని రెబల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యామిలీ ఘనంగా సత్కరించింది. ‘‘25 సంవత్సరాలుగా మాకోసం ఎంతో చేశారు. ఇన్ని సంవత్సరాలుగా మీరు చూపిన ప్రేమ, ప్రయత్నాలు మా విజయానికి పిల్లర్‌గా నిలబడ్డాయి. మీరు మా ఫ్యామిలీలో భాగమైనందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాము. మీరు లేకుండా మా ఫ్యామిలీని ఊహించుకోలేము..’’ అని గోపీకృష్ణా మూవీస్ ట్విట్టర్ వేదికగా కృష్ణంరాజు తెలియజేయగా.. ‘‘25 సంవత్సరాలుగా మాకోసం చాలా చేశారు. థ్యాంక్యూ పద్మ ఆంటీ’’ అంటూ కృతఙ్ఞతలు తెలిపారు కృష్ణంరాజు కూతురు ప్రసీద. 


ఫ్యామిలీ అంతా కలిసి పద్మతో ఫొటోలు దిగడమే కాకుండా, పద్మను అభినందిస్తూ కేక్‌ను కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నట్లుగా తెలుపుతున్న ఫొటోలను వారు షేర్ చేశారు. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాక కృష్ణంరాజు ఫ్యామిలీపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దటీజ్ రెబల్ స్టార్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.