నాయకుడంటే.. గంగూలీనే!

ABN , First Publish Date - 2020-06-21T08:30:35+05:30 IST

కెప్టెన్‌గా సౌరవ్‌ గంగూలీ పగ్గాలు చేపట్టాక భారత క్రికెట్‌ జట్టు రూపురేఖలే మారాయని మాజీ ఓపెనర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ అభిప్రాయపడ్డాడు. విదేశాల్లోనూ గెలవగలమనే ఆత్మవిశ్వాసాన్ని....

నాయకుడంటే.. గంగూలీనే!

కృష్ణమాచారి శ్రీకాంత్‌


చెన్నై: కెప్టెన్‌గా సౌరవ్‌ గంగూలీ పగ్గాలు చేపట్టాక భారత క్రికెట్‌ జట్టు రూపురేఖలే మారాయని మాజీ ఓపెనర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ అభిప్రాయపడ్డాడు. విదేశాల్లోనూ గెలవగలమనే ఆత్మవిశ్వాసాన్ని జట్టులో నింపాడని, అతడు పుట్టుకతోనే నాయకుడంటూ కొనియాడాడు. ‘గంగూలీ చాలా చురుగ్గా ఉండే వ్యక్తి. చక్కటి టీమ్‌ కాంబినేషన్‌ను ఏర్పరుచుకుని జట్టును విజయాలబాట పట్టించాడు. అప్పట్లో విండీ్‌సను క్లైవ్‌ లాయిడ్‌ ఎలా కదం తొక్కించాడో.. అదే తీరున దాదా టీమిండియాను ముందుకు నడిపించాడు. అంతేకాకుండా సహచరులను ఉత్తేజపరుస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. అందుకే తను విజయవంతమైన కెప్టెన్‌ కాగలిగాడు. అదే జోష్‌లో విదేశీ గడ్డపై కూడా విరివిగా విజయాలు సాధించగలిగారు’ అని ఓ టీవీ చానెల్‌లో శ్రీకాంత్‌ తెలిపాడు. తన హయాంలో ధోనీ, ఇర్ఫాన్‌, యువరాజ్‌, కైఫ్‌లాంటి ఆటగాళ్లకు  దాదా మద్దతుగా నిలిచాడు.

Updated Date - 2020-06-21T08:30:35+05:30 IST