Abn logo
Nov 26 2020 @ 10:24AM

అవును.. డేటింగ్‌లో ఉన్నాం: కృతి

`బ్రూస్ లీ`, `తీన్‌మార్`, `ఒంగోలు గిత్త` వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన హీరోయిన్ కృతి కర్బందా ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి సారించింది. అక్కడి సినిమా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్‌తో ప్రేమాయణం సాగిస్తోంది. వీరిద్దరూ ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 


ఈ వార్తలపై తాజాగా కృతి స్పందించింది. `పులకిత్ చాలా మంచి వ్యక్తి. మా ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి. అందువల్లే మేం రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టాం. ఏడాదిన్నర నుంచి డేటింగ్‌లో ఉన్నాం. అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం ఇద్దరం కెరీర్‌పైనే దృష్టి సారించాం. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్న తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తామ`ని కృతి పేర్కొంది. 

Advertisement
Advertisement
Advertisement