Oct 17 2021 @ 00:30AM

ఆదిపురుష్‌ సెట్స్‌కు జానకి బై బై

ప్రభాస్‌, కృతీ సనన్‌ జంటగా రూపొందుతోన్న సినిమా ‘ఆదిపురుష్‌’. రామాయణం ఆధారంగా దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇందులో ఆదిపురుషుడు శ్రీరామునిగా ప్రభాస్‌, జానకిగా కృతీ సనన్‌, లంకేషుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ కనిపించనున్నారు. ఇటీవల సైఫ్‌ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేసిన ఓం రౌత్‌, తాజాగా కృతీ సనన్‌ పాత్ర చిత్రీకరణ పూర్తి చేశారు. శనివారం ఆమెకు వీడ్కోలు పలికారు. కృతీ సనన్‌ కూడా ‘ఆదిపురుష్‌’ సెట్స్‌కు బై బై చెప్పారు. ‘‘ఇంత త్వరగా నా ప్రయాణం పూర్తయ్యిందంటే నమ్మశక్యంగా లేదు. జానకిగా నటించే ఛాన్స్‌ ఇచ్చిన... పాత్ర బరువు బాధ్యతలు మోయగలనని నమ్మిన ఓం రౌత్‌కు థ్యాంక్స్‌’’ అని కృతీ సనన్‌ పేర్కొన్నారు.


Bollywoodమరిన్ని...