May 18 2021 @ 10:27AM

అలా అడిగితే..నో చెప్పేస్తున్న కృతిశెట్టి

‘ఉప్పెన‌’ స‌క్సెస్‌తో కృతిశెట్టి రేంజ్ మారిపోయింది. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆమెతో సినిమా చేయాల‌ని ఆస‌క్తి చూపుతున్నారు. వ‌స్తున్న అవ‌కాశాల‌ను ఎంచుకోవ‌డంలో కృతిశెట్టి మాత్రం చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ట‌. వ‌చ్చిన ప్రాజెక్టున‌ల్లా ఒప్పేసుకోవ‌డం లేద‌ట‌. త‌న పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉండ‌టంతో పాటు, రెమ్యున‌రేష‌న్ విష‌యంలోనూ లెక్క‌లు వేసుకుంటూ సినిమాల‌కు ఓకే చెబుతోంద‌ట ఈ శాండిల్ వుడ్ బ్యూటీ. ఇద్ద‌రు హీరోయిన్స్ ఉన్న సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా చేయాలనో, గెస్ట్ అప్పియ‌రెన్స్ చేయాల‌నో ఎవ‌రైనా అడిగితే ఏమాత్రం ఆలోచించ‌కుండా నో చెప్పేస్తుంద‌ని టాక్‌. రీసెంట్‌గా ఓ యంగ్ హీరో, ప్ర‌ముఖ బ్యాన‌ర్‌లో చేస్తున్న సినిమా కోసం కృతిశెట్టిని గెస్ట్ అప్పియ‌రెన్స్ చేయ‌మ‌ని అడిగార‌ట‌. అయితే కృతి శెట్టి మొహ‌మాటం లేకుండా రిజెక్ట్ చేసింద‌నే వార్త‌లు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.