Abn logo
Oct 17 2020 @ 13:53PM

ప్రభాస్‌ జోడీగా మహేశ్‌ హీరోయిన్‌..?

Kaakateeya

ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్‌ దర్శకుడు ఓంరావుత్‌ తెరకెక్కించనున్న చిత్రం 'ఆదిపురుష్‌'. ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా నటించబోతున్నాడంటూ, సైఫ్‌ అలీఖాన్‌ రావణుడిగా నటించబోతున్నారనే సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమాలో సీత పాత్రలో ఎవరు నటిస్తారు? అనే దానిపై చాలా వార్తలు హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. అనుష్క, కీర్తిసురేశ్‌, కియా అడ్వానీ, అనుష్క శర్మ ఇలా చాలా పేర్లే వినిపించాయి. కాగా.. ఇప్పుడు మరో హీరోయిన్‌ పేరు పరిశీలనలో ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో మహేశ్‌బాబు 'వన్‌ నేనొక్కడినే' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కృతిసనన్‌తో చర్చలు జరుపుతున్నారని, అంతా ఓకే అయితే కృతిసనన్‌ సీతగా నటిస్తుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. టీ సిరీస్‌ బ్యానర్‌పై భూషణ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


Advertisement
Advertisement
Advertisement