Advertisement
Advertisement
Abn logo
Advertisement

ముగిసిన కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ

హైదరాబాద్: కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ ముగిసింది. వర్చువల్‌ భేటీకి రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు హాజరైనారు. తెలంగాణ, ఏపీ సాగు, తాగునీటి అవసరాలపై అధికారులు చర్చించారు. 15 రోజుల్లో ముగిసే ఖరీఫ్ పంట కోసం కాకుండా.. రాబోయే యాసంగి సీజన్ కోసం చర్చించాలని తెలంగాణ సూచించింది. తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ ప్రతిపాదనకు ఏపీ సుముఖత వ్యక్తం చేసింది. యాసంగి సీజన్‌కు సాగునీటి కోసం 150 టీఎంసీలు.. తాగునీటి కోసం 90 టీఎంసీలు అవసరమౌతాయని తెలంగాణ పేర్కొంది. ఖరీఫ్ 15 రోజుల సీజన్ కోసం 23 టీఎంసీలు కావాలని ఏపీ కోరింది. త్వరలో మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకుందామని కేఆర్‌ఎంబీ తెలిపింది.


Advertisement
Advertisement