పండుగలకూ దూరం.. దూరం

ABN , First Publish Date - 2020-08-12T10:55:25+05:30 IST

ఈ రోజు ఏమిటో తెలుసా.. కృష్ణాష్టమి.. చిన్ని కృష్ణుల సందడి లేదు.. గోపికమ్మల ఆటాపాటాలేదు.. యువత ఉట్టి కొట్టడాల్లేవ్‌.. ..

పండుగలకూ దూరం.. దూరం

పండుగా లేదు.. పేరంటమూ లేదు

భయం.. భయంగా జనం.. కానరాని కృష్ణాష్టమి సందడి


భీమవరం రూరల్‌, ఆగస్టు 11 : ఈ రోజు ఏమిటో తెలుసా.. కృష్ణాష్టమి.. చిన్ని కృష్ణుల సందడి లేదు.. గోపికమ్మల ఆటాపాటాలేదు.. యువత ఉట్టి కొట్టడాల్లేవ్‌.. అంతా ష్‌ గప్‌చుప్‌.. ఎక్కడివారక్కడే.. పండగా లేదు.. పబ్బమూ లేదు.. ఆనందమూ లేదు.. బంధువుల రాకతో సందడి లేదు.. అంతా మాస్కులు పెట్టుకుని.. తలుపులకు గొళ్లాలు పెట్టుకుని ఇంట్లో కూర్చోవడమే. ఎక్కడా పం డుగ సందడి కానరావడం లేదు.. ఏంటో 2020 ఎవరికీ అర్ధం కాకుండా ఉంది.. కరోనా విజృంభణ కారణంగా పండుగలకు దూరం కాకతప్పడం లేదు.ఒకటా, రెండా గ్రామాల్లో అట్టహాసంగా బంధువులతో పిండి వంటలతో జరుపుకునే అమ్మవార్ల జాతర్లు నిలిచాయ్‌.. తెలుగు సంవ త్సరాది ఉగాదికి శుభాకాంక్షలే కరువయ్యాయి.. ఆషాఢ మాస గ్రామ దేవతలకు గ్రామస్థులు సమర్పించే చలివిడి పానకాలు, మొక్కబడిగా సాగాయి.. శ్రీరామనవమి, హనుమజ్జయంతి కూడా అంతే గత నెల 1న తొలి ఏకాదశికి భక్తులు దూరమయ్యారు.


అదే నెల 31వ తేదీ జరిగిన వరలక్ష్మీ వ్రతంది ఇదే పరిస్థితి..కనీసం పేరంటానికి రావడానికి భయపడ్డారు. ఈ నెల ఒకటవ తేదీన బక్రీద్‌ సైలెంట్‌గా చేసుకోవాల్సి వచ్చింది. మంగళవారం అట్టహాసంగా జరిగే కృష్ణాష్టమి వేడుకలు కాన రాకుండాపోయాయి. ఇదిలా ఉండగా మరో పది రోజుల్లో అంటే ఈ నెల 22వ తేదీన వినాయక చవితి రానుంది.. ప్రతీ ఏడాది వీధివీధినా ఎంతో అట్టహాసంగా నవరాత్రులు జరిపేవారు.ఈ ఏడాది మాత్రం నివాసాల్లోనే జరుపుకోవాలని పోలీసు యంత్రాంగం ప్రకటించింది. దీంతో   వినాయక చవితి వేడుకలు ఇంటికే పరిమితమవుతున్నాయి. విగ్రహాల ఊరేగింపు ఈ ఏడాదికి లేనట్టే. మరి అక్టోబర్‌ నెలలో దసరా వేడుకలు ఎలానో మరి. కరోనా ఇలాగే ఉంటే రానున్న పండుగలకు నిశ్శబ్దం తప్పదనిపిస్తుంది.   


ఆగస్టు 15 ఎలా.. 

దేశభక్తిని చాటుకునే ఆగస్టు 15 నిర్వహణ ఎలా.. ఇదీ ప్రస్తు తం అటు అధికారులు.. ఇటు నాయకులు.. ప్రజలందరి మధ్య తలెత్తున్న ప్రశ్న.. ఎందుకంటే ప్రతీ ఏడాది ఎంతో ఘనంగా జరి పేవారు. ప్రస్తుతం కనీసం స్వేచ్ఛగా జరపడానికి వీల్లేకుండా పోయింది.లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలలు, కళాశాలలు మూతపడే ఉన్నాయి.దీంతో ఈ ఏడాది ఆయా కళాశాలల్లో వేడుకలు లేనట్టే.. సెప్టెంబర్‌ 5న టీచర్స్‌డే, అక్టోబర్‌ నెల 2న గాంధీ జయంతి కరోనా ప్రభావం బట్టి ఆధారపడుతుందనే అనుకోవాలి. 

Updated Date - 2020-08-12T10:55:25+05:30 IST