మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ విఫలం: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-08-07T20:19:28+05:30 IST

మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడేళ్లుగా

మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ విఫలం: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడేళ్లుగా హైదరాబాద్‌ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. వరద బాధితులకు రూ.10 వేలు ఇస్తామని చెప్పి రూ.600 కోట్లు విడుదల చేసి.. వరద బాధితుల పేరుతో రూ.300 కోట్లు టీఆర్‌ఎస్‌ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. దళిత బందు తెచ్చామని గొప్పలు చెప్పే ప్రభుత్వం.. దళిత కార్మికులు చనిపోతే... వారి కుటుంబాలను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఇద్దరు దళితులు చనిపోతే పరామర్శించడానికి  జీహెచ్‌ఎంసీ అధికారులు రాలేదని తప్పుబట్టారు. అంతయ్య మృతదేహం గాలింపు చర్యలు వేగవంతం చేయాలన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి నష్ట పరిహారం ఇవ్వాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2021-08-07T20:19:28+05:30 IST