లాక్‌డౌన్‌ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కేటీఆర్‌

ABN , First Publish Date - 2020-03-26T12:30:00+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కేటీఆర్‌

లాక్‌డౌన్‌ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కేటీఆర్‌

అన్నపూర్ణ భోజనం ఉచితం..!

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిర్ణయం   

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్నార్తుల ఆకలి తీర్చేందుకు రూ.5కే భోజనం అందించే అన్నపూర్ణ కేంద్రాలను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించిన సంస్థ, ఇప్పుడు ఆ కేంద్రాల్లో ఉచితంగా భోజనం అందజేయనుంది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి గ్రేటర్‌లోని 150 అన్నపూర్ణ కేంద్రాల వద్ద అన్నార్తులకు ఉచితంగా భోజనం అందజేస్తామని ప్రకటించారు. లాక్‌డౌన్‌ వల్ల ఎవరూ ఆకలితో బాధపడవద్దన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. హాస్టళ్లలో ఉండే వారు, వర్కింగ్‌ పర్సన్‌లకు జీహెచ్‌ఎంసీ తరపున ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-26T12:30:00+05:30 IST