Advertisement
Advertisement
Abn logo
Advertisement

మా పాలనకు అంబేడ్కర్‌ ఆలోచనలే ప్రాతిపదిక: కేటీఆర్‌

హైదరాబాద్‌, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఉద్యమ పోరాటంలోనే కాకుండా ప్రభుత్వ పాలనలోనూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ ఆలోచనలే తమకు ప్రాతిపదిక అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా సోమవారం ప్రగతి భవన్‌లో ఆయన చిత్రపటానికి మంత్రి కేటీఆర్‌, పలువురు ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తుకు అవసరమైన రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన అంబేడ్కర్‌ ఆలోచనలు అత్యంత ఆదర్శనీయమన్నారు.


గాంధీభవన్‌లో అంబేడ్కర్‌కు నివాళి

అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా సోమవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నేత వి. హన్మంతరావు, టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌ చిన్నారెడ్డి, ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్‌ తదితరులు పాల్గొన్నారు.


వైఎ్‌సఆర్‌టీపీ కార్యాలయంలోనూ..

వైఎ్‌సఆర్‌టీపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పార్టీ నేతలు నివాళులర్పించారు. పార్టీ అధికార ప్రతినిధులు పిట్టా రాంరెడ్డి, ఏపూరి సోమన్న తదితరులు పాల్గొన్నారు. 


ఎన్టీఆర్‌ భవన్‌లోనూ.. 

ఎన్టీఆర్‌భవన్‌లో టీడీపీ-టీఎస్‌ నేతలు అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement