చేనేత కార్మికుల సంక్షేమమే ధ్యేయం: కేటీఆర్

ABN , First Publish Date - 2021-09-07T22:47:20+05:30 IST

హైదరాబాద్: చేనేత కార్మికుల సంక్షేమమే ధ్యేయమని మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేత, జౌళి రంగాల అభివృద్ధిపై మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, వాటి అమలుపై చర్చించారు.

చేనేత కార్మికుల సంక్షేమమే ధ్యేయం: కేటీఆర్

హైదరాబాద్: చేనేత కార్మికుల సంక్షేమమే ధ్యేయమని మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేత, జౌళి రంగాల అభివృద్ధిపై మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, వాటి అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన పలు అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకున్నారు.


పలు కార్యక్రమాలకు అవసరమైన నిధులపై రెండు వారాల క్రితం ఆర్థిక మంత్రి హరీష్‌రావు గారితో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. తాజాగా మరోసారి టెక్స్టైల్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి.. చేనేత కార్మికుల ఆకాంక్షలపై సానుకూల నిర్ణయం తీసుకున్నారు. కార్మికుల సంక్షేమార్థం.. సుమారు రూ.73.50 కోట్లు విడుదల చేసినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-07T22:47:20+05:30 IST