ఎమ్మెల్యేకు కేటీఆర్‌ శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2020-08-15T10:50:17+05:30 IST

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌కు మంత్రి కేటీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

ఎమ్మెల్యేకు కేటీఆర్‌ శుభాకాంక్షలు

కోదాడ, ఆగస్టు 14 : ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌కు మంత్రి కేటీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా హైదారబాద్‌లో శుక్రవారం జరిగిన ఎమ్యెల్యే కుమారుడి నిశ్చితార్ధానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.కార్యక్రమంలో కోదాడ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ వనపర్తి శిరీషాలక్ష్మినారాయణ, టీఆర్‌ఎస్‌ నాయకులు హాజరయ్యారు. 


అన్నదానం మహాదానం

సూర్యాపేటటౌన్‌/అనంతగిరి: అన్నిదానాల కన్నా అన్నదానం మహాదానమని టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు గండూరి ప్రకాష్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని గోపాలపురంలో కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్యయాదవ్‌ జన్మదినం సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ప్రవళిక బోర్‌వెల్స్‌ నిర్వహకులు సోమగాని సోమే్‌షగౌడ్‌, నందకిశోర్‌ పాల్గొన్నారు. అదేవిధంగా అనంతగిరి మండలంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కలను నాటారు. కేక్‌ కట్‌ చేసి స్వీట్లను పంచారు. 

Updated Date - 2020-08-15T10:50:17+05:30 IST