కుమరం భీం, కుమరం సూరు వర్ధంతి

ABN , First Publish Date - 2021-10-28T03:42:08+05:30 IST

కుమరంభీం, కుమరం సూరు వర్ధంతిలను బుధవారం మండలకేంద్రలో ఆదివాసీ నాయకులు ఘనంగా జరుపుకొ న్నారు. ఈ సందర్భంగా భీం, సూరు విగ్రహాల వద్ద పూజలు నిర్వహించి జెండాను ఆవిష్కరిం చారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కుమరం భీం, కుమరం సూరు వర్ధంతి
కుమరం భీంకు నివాళులు అర్పిస్తున్న ఆదివాసీ నాయకులు

వాంకిడి, అక్టోబరు 27: కుమరంభీం, కుమరం సూరు వర్ధంతిలను బుధవారం మండలకేంద్రలో ఆదివాసీ నాయకులు ఘనంగా జరుపుకొ న్నారు. ఈ సందర్భంగా భీం, సూరు విగ్రహాల వద్ద పూజలు నిర్వహించి జెండాను ఆవిష్కరిం చారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో  సర్పంచులు పవన్‌, దేవరావు, సిడాం అన్నిగ, గంగారం, తుడుందెబ్బ జిల్లా నాయకుడు కోట్నాక విజయ్‌, ఉపాధ్యాయసంఘం నాయకుడు ఇందు రావు, ఎస్సై డీకొండరమేష్‌, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.

కుంరం సూరు వర్ధంతిని విజయవంతం చేయాలి..

జైనూరు: జల్‌, జంగల్‌, జమీన్‌ కోసం బ్రిటీష్‌ ప్రభుత్వంతో పోరాడిన అమరజీవి, అడవిబిడ్డ కురంసూరు వర్ధంతిని విజయవంతం చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ కనక యాదవ్‌ రావ్‌ కోరారు. స్థానిక ఎంపీపీ కార్యాలయంలో బుధవారం కొలాం సంఘం నాయకులతో సూరు వర్ధంతి నిర్వహణపై ఆయన మాట్లాడారు. మండలంలోని జంగాంలో ఈనెల29న కుంరం సూరు వర్ధంతిని ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచక జరుగుతున్నా యన్నారు. కార్యక్ర మంలో జైనూరు, సిర్పూర్‌(యూ), లింగాపూర్‌ మండలాల కోలాం సంఘం అధ్యక్షుడు ఆత్రం రాజు, జిల్లా నాయకులు ఆత్రం భీంరావ్‌, ఆత్రం బాపూరావ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T03:42:08+05:30 IST