Advertisement
Advertisement
Abn logo
Advertisement

కుంభవృష్టి

పొంగుతున్న వాగులు, వంకలు

గ్రామాలకు నిలిచిన రాకపోకలు

స్తంభించిన జనజీవనం

గూడూరు సమీపంలో హైవేపైకి వరదనీరు

జిల్లాలో సగటు వర్షపాతం 107.9 మి.మీ

మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు


నెల్లూరు, నవంబరు29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆది,సో మవారాలు  కుంభవృష్టి కురిసింది. గడచిన 48 గంటల్లో ఎడతెరపి లేకుండా కురిసిన భారీవర్షాలకు వాగులు, వంక లు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల చెరువులు కలుజులు పారుతున్నాయి.భారీవర్షాలకు జనజీవనం స్తంభించిపోయిం ది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న కారణంగా పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. చెన్నై జాతీయ రహదారిపై గూడూరు ఆదిశంకర కాలేజీ వద్ద  వరద ప్రవహించడంతో వాహనాలు కిలోమీటర్ల దూరం ఆగిపో యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా 107.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా పరిధిలోని 26 మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. పొదలకూరు, చిల్లకూరు, బాలాయపల్లి, గూడూరుల్లో అత్యధికంగా 200మి.మీ వర్షపాతం నమో దైంది. పొదలకూరులో కయ్యలు, కాలువలు అన్నీ ఏకమ య్యాయి. పంటలు మునిగిపోయాయి. గూడూరు ఆర్టీసీ బ స్టాండుతో సహా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమ య్యాయి.  జిల్లా వ్యాప్తంగా 26 మండలాల్లో 100 నుంచి 200 మి.మీ వర్షపాతం రికార్డు అయింది. కలిగిరి, అల్లూరు, విడవలూరు, సీతారామపురం మండలాల్లో మాత్రం కాస్త తక్కువగా 36 నుంచి 50 మి.మీలోపు వర్షం కురిసింది. మిగిలిన 16 మండలాల్లో 60 నుంచి 100 మి.మీ లోపు వర్షపాతం రికార్డు అయింది.  ఎగువ ప్రాంతాల నుంచి సోమశిలకు వరద పెరిగింది. దీంతో 1.15లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో పెన్నా నది ప్రవాహ  ఉధృతి పెరిగింది. మరో రెండు రోజులపాటు భా రీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలియచేయడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షం తాలూకు వివరాల్లోకి వెళితే..

సైదాపురం మండలం కలిచేడు చెరువు కలుజుకు గండి పడింది. ఒడ్డుపాళెం, ఎస్టీ కాలనీలపైకి నీరు ప్రవ హించింది. కైవల్యానది ప్రవాహంతో సైదాపురం- గూడూరు మధ్య రాకపోకలు స్తంభించాయి.  సైదాపురం- పొదలకూ రుల మధ్య మాలేరువాగు, పిన్నెరువాగుల ఉధృతి కారణం గా  దేవరవేమూరు, కట్టుబడిపల్లి గ్రామాలు జలదిగ్బంధం లో చిక్కుకున్నాయి.  

చైన్నై హైవే మళ్లీ స్తంభించింది. గూడూరు ఆదిశంకర కాలేజీ వద్ద వరదనీరు రోడ్డుపైకి ప్రవహించడం తో వాహనాల రాకపోకలను తీవ్ర అంతరాయం కలుగుతోం ది. మూడు కిలోమీటర్ల దూరం ట్రాఫిక్‌ కొనసాగుతోంది. ఎస్పీ విజయరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేసి పోలీసులు ట్రాఫిక్‌ ను క్లియర్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాని ఆదిశంకర కాలేజీ వద్ద రోడ్డు దాటడం కోసం హైవేపై గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. 

చిట్టమూరు మండలంలో వరినాట్లు, నారుమళ్లు నీట మునిగాయి. రొయ్యలకాలువలో నీటి ఉధృతి పెరగడంతో మల్లాం, కొత్తగుంట గ్రామాల మధ్య రాకపోకలు  నిలిచిపో యాయి.

చేజర్ల మండలం నాగులవెల్టటూరు చెరువు కట్ట తెగిపోయింది. దిగువన ఉన్న పంటపొలాలు కోతకు గురయ్యాయి. 

రాపూరు మండలం తూమాయి చెరువుకు గండి పడింది. కండలేరు డ్యాం 6వ కిలోమీటరు వద్ద మట్టికట్ట దెబ్బతినండంతో రెవెన్యూ, ఇరిగేషన ఇంజనీర్లు ఆ ప్రదేశా న్ని పరిశీలించి కట్ట పటిష్టతకు చర్యలు తీసుకున్నారు. గండవోలు చెరువు ప్రమాదస్థాయికి చేరుకోవడంతో గ్రామ స్థులు చెరువుకు గండి కొట్టారు. 

గూడూరు ఆర్టీసీ బస్టాండులో మోకాటి లోతు వరద నీరు చేరుకున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ ఇదే తరహాలో జలమయమయ్యాయి. రజకకాలనీలో ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించింది. 

 ఏఎస్‌పేట మండలంలో నక్కలవాగు పొంగిపొ ర్లడంతో కల్వర్టుపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

బాలాయపల్లి మండలం అలిమిలి వద్ద రహదారి కోతకు గురికావడంతో ఆ దారిలో రాకపోకలు స్తంభిం చాయి.

బాలాయపల్లి మండలం నేరేడు కాలువ ఉప్పొంగడం తో వెంకటగిరి- గూడూరుల మధ్య రాకపోకలు నిలిచిపో యాయి. 

వరికుంటపాడు మండలం కనియంపాడులో పి ల్లాపేరు ఉధృతంగా ప్రవహించడంతో వాగును పరిశీలిం చిన పోలీసులు ఉధృతి తగ్గేవరకు ఆ దారిలో రాకపోకలు నియంత్రించారు. 

బుచ్చి మండలం మినగల్లు వద్ద పెన్నానది ఉధృతి పెరగడంతో తీరం వెంబడి ఉన్న సరుకు తోట కోతకు గురైంది.

మర్రిపాడు మండలం పొంగూరు చెరువు నిండి నీళ్లు గ్రామంమీదకు వస్తుండడంతో రెవెన్యూ సిబ్బంది చెరువుకు గండి కొట్టి నీటిని వెలుపలికి పంపారు.

పొదలకూరు మండలంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. 60 చెరువుల్లో ప్రమాదస్థాయిలో నీటి నిల్వలు చేరుకున్నాయి. 

దొరవారిసత్రం మండలం తనియాలి వద్ద కాళంగిపై ఉన్న వంతెనపై వరద నీటి ప్రవాహంతో 8 గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. 

మర్రిపాడు మండలంలో చెరువుల కింద ఉన్న గ్రామాలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నాయి. అన్ని చెరువులు నిండి కలుజులు పారుతున్నాయి.  నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న చెరువుల్లో నుంచి అలుగుల ద్వారా ఎక్కువ నీటిని బయటకు పంపుతున్నారు. 


 సగటు వర్షపాతం- 107.9 మి.మీ


పొదలకూరు, చిల్లకూరు, బాలాయపల్లి గూడూరుల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. 26మండలాల్లో 100 నుంచి 200 మి.మీ వర్షపాతం రికార్డు అయింది. కలిగిరి, అల్లూరు, విడవలూరు.సీతారామపురంలో తక్కువ వర్షపా తం 36 నుంచి 50 మి.మీగా నమోదైంది. 302మి.మీ సాధా రణం కాగా 743 మి.మీ కురిసింది. 


 పెన్నా పొర్లుకట్టపై సొరంగం


 కోవూరు, నవంబరు 29 : పెన్నా ప్రవాహం ధాటికి కోవూరు మండలం వేగూరు ప్రాంతంలో పొర్లుకట్ట తెగే ప్రమాదం ఏర్పడింది. భారీ వరద ప్రవాహం, దానికి తగ్గట్టు నెల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పొర్టుకట్టకు వేగూరుకండ్రిగ సమీపంలో సొరంగంఏర్పడింది.  నది ప్ర వాహం పెరిగితే సొరంగం విస్తరించి పొర్లుకట్ట పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్ధితి ఏర్పడింది. పొర్లుకట్టకు సొరంగం పడిందని స్ధానికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, వారు సోమవారం రాత్రి పరిశీలించారు. గండిని పూడ్చేం దుకు సుమారు రూ.50లక్షలు ఖర్చవుతుందని అధికారులు తమ నిస్సహాయతను వ్యక్తం చేసి వెళ్లిపోయారు. గ్రామస్థులే పూడ్చాలని చెప్పి వెళ్లిపోయారు.


చెరువులకు పోటెత్తిన వరద


నెల్లూరు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లాకు పెను ప్రమాదం పొంచి ఉంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులన్నీ నిండుతున్నాయి. ఇప్పటికే మూడో వంతు చెరువులు నిండాయి. ప్రస్తుతం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద పోటెత్తుతోంది. దీంతో మిగిలిన చెరువులు కూడా ఒకటి, రెండు రోజుల్లో  నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు ప్రజలు, ఇటు అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలు చెరువులకు గండి పడి, కొన్ని గ్రామాల్లోకి నీరు చేరింది. మరికొన్ని చెరువుల కట్టలు ప్రమాదపుటంచున ఉన్నాయి. ఎప్పుడు తెగిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా చెరువుల కింద ఉన్న గ్రామాల ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. మరికొన్ని చోట్ల అధికారులు, ప్రజలు ముందు జాగ్రత్తగా గ్రామాలకు దూరంగా చెరువుల కు గండ్లు కొడుతున్నారు. జిల్లాలోని చెరువులకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉండేవన్నీ గొలుసుకట్టు చెరువులు. ఒక చెరువు మీద నుంచి నీరు మరో చెరువులోకి ప్రవహి స్తుంది. దీంతో ఒక చెరువు నిండి తెగితే ఆ నీరంతా కిందనుండే చెరువులపై పడుతుంది. అప్పుడు ఆ చెరువు కూడా ప్రమాదంలో పడుతుంది. ఈ కారణంగా ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. మరో వైపు పెన్నాకు వదర పోటెత్తుతుండడంతో ఆందోళనను రెట్టింపు చేస్తోంది. కొన్ని గ్రామాలు ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామాల చుట్టూ ఉండే వాగులు పొంగి రోడ్ల మీద ప్రవహిస్తుండడంతో ఆ గ్రామాల ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటువంటి చోట్ల చెరువులు తెగి నీరు ఊర్లమీద పడితే పరిస్థితిని ఊహించడం కూడా కష్టమని ఓ ఉన్నతాధికారి ఆందోళన వ్యక్తం చేశారు. 


73 శాతం చెరువులు ఫుల్‌


జిల్లాలో మొత్తం 1746 చెరువులు ఉండగా, అందులో సోమవారం నాటికి 1268 చెరువులు నిండాయి. మరో 302 చెరువులు ఇంకొన్ని గంటల్లోనే  నిండిపోయే అవకాశాలున్నా యి. ఇక మిగిలిన చెరువుల్లో 50 శాతానికిపైగా నీరుంది. పూర్తిగా నిండిన చెరువుల్లో కలుజులపై నీరు పారుతోంది. భారీ వర్షాలు కురుస్తూనే ఉండడంతో కట్టలు బలహీనపడి ఎక్కడ గండ్లు పడతాయోనని ఇరిగేషన శాఖ ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చిట్టమూరు, వాకాడు, ఓజిలి, నాయుడుపేట, సూళ్లూరుపేట, దగదర్తి మండలాల్లోని చెరువులన్నీ పూర్తిగా నిండిపోయాయి. కోట, ఉదయగిరి, వరికుంటపాడు, బాలాయపల్లి, డక్కిలి, దొరవారిసత్రం, ఏఎస్‌పేట, ఆత్మకూరు, నెల్లూరు రూరల్‌, పొదలకూరు, మనుబోలు, వెంకటగిరి మండలాల్లోని చెరువులన్నీ దాదాపుగా నిండిపోవచ్చాయి. 


ఇటు ప్రజలు.. అటు రైతుల ఆందోళన


ప్రస్తుతం రబీ సీజనలో రైతులు వరి నాట్లు వేస్తున్నారు. చాలా వరకు పంట చెరువుల కిందనే సాగుతుంది. ఈ నేపథ్యంలో చెరువులు తెగితే గ్రామాలతోపాటు పంట పొలాలు కూడా మునిగిపోతాయి. దీంతో ఇటు ప్రజలతో పాటు అటు రైతులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చెరువుల కింద పంట కాలువలు మాత్రమే ఉండడంతో తూముల గుండా ఎక్కువ నీటిని వదిలేయడం సాధ్యం కాదు. ఈ కారణంగానే అధికారులు కూడా ప్రత్యామ్నాయం గా ఎటువంటి చర్యలు చేపట్టలేకపోతున్నారు. గ్రామస్థులు వారి పరిధిలోని చెరువులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ గండ్లు పడుతున్నట్లు అనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా చెరువు తెగిపోతుందన్న అనుమానం ఉన్నచోట ముంపు గ్రా మాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరముం ది. ముందుగా మేల్కొంటే చాలా వరకు నష్టాన్ని తగ్గించ గలుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

తడ : ఉధృతంగా ప్రవహిస్తున్న పాముల కాలువ


నెల్లూరు ట్రంకురోడ్డులో వర్షపునీటి ఇక్కట్లు పడుతున్న వాహనదారులు


వరికుంటపాడు మండలం కనియంపాడు వద్ద పిల్లాపేరు ఉధృతిని పరిశీలిస్తున్న సీఐ గిరిబాబు, సిబ్బంది


Advertisement
Advertisement