Abn logo
Aug 9 2020 @ 23:08PM

స్పిన్నరేకానీ.. అలా కనిపించడు.. కుంబ్లేపై కామెంటేటర్ కామెంట్స్!

న్యూఢిల్లీ: భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ స్పిన్నర్లలో అనిల్ కుంబ్లే ఒకడు. కానీ కెరీర్ తొలి దశలో అతన్ని అంతా వేరేగా పిలుచుకునేవారని వెల్లడించాడు మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్. డొమెస్టిక్ క్రికెట్ ఆడేరోజుల్లో కుంబ్లే బౌన్సర్లు వేసేవాడని, వాటిని బ్రెట్‌లీ విసిరే బంతుల్లా బ్యాట్స్‌మెను ఎదుర్కోవాల్సి వచ్చేదని మంజ్రేకర్ చెప్పాడు. దీంతో కుంబ్లేకు చాలా పేరొచ్చిందన్న మంజ్రేకర్.. ఈ కారణంగా అందరూ కుంబ్లే గురించి మాట్లాడుకునేవారని తెలిపాడు. ‘ఓ పొడవాటి లెగ్‌స్పిన్నర్ ఉన్నాడు. కానీ చూడటానికి అతను అసలు స్పిన్నర్‌లా కనిపించడు’ అంటూ కుంబ్లే గురించి అందరూ చెప్పుకునేవారని మంజ్రేకర్ గుర్తుచేసుకున్నాడు.

Advertisement
Advertisement
Advertisement