Abn logo
Sep 22 2021 @ 02:06AM

కుంద్రా ల్యాప్‌టాప్‌, ఫోన్లలో 119 అశ్లీల వీడియోలు

జైలు నుంచి విడుదల

ముంబై, సెప్టెంబరు 21: వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రా మొబైల్‌ ఫోన్‌, ల్యాప్‌టా్‌పలలో 119 అశ్లీల వీడియోలు ఉన్నాయని ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు మంగళవారం తెలిపారు. ఆయన వాటిని రూ. 9 కోట్లకు విక్రయించాలని ప్రణాళిక రచించుకున్నాడని వారు వివరించారు. కాగా.. ముంబై జైలు నుంచి కుంద్రా బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయనకు ముంబై న్యాయస్థానం సోమవారం బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. శిల్పా శెట్టి మంగళవారం ఒక సందేశాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘మన అత్యున్నత గౌరవం పడిపోకుండా ఉండటంలో కాదు, పడిపోయిన ప్రతీసారీ లేవడంలో ఉంటుంది’’ అని అందులో రాసుకొచ్చారు. తన భర్త కుంద్రా బెయిల్‌పై విడుదలైన నేపథ్యంలో ఈ పోస్టు ఆసక్తికరంగా మారింది. ఇక.. తనపై కథనాలు ప్రచురించకుండా మీడియాను అడ్డుకోవాలని కోరుతూ శిల్పాశెట్టి దాఖలు చేసిన పిటిషన్‌పై బోంబే హైకోర్టు స్పందించింది. ఆమె పిల్లలపై మీడియా ప్రచురిస్తున్న కథనాలు ఆందోళనను కలిగిస్తున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 1కి కోర్టు వాయిదా వేసింది.