Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘రూర్బన’లో భారీ అక్రమాలు

162 పనులకు ఎం-బుక్కులు కూడా లేని వైనం

రూ.62.25 లక్షలు పక్కదారి.. రోడ్డు మీదే రోడ్డు..

కంబదూరు, నవంబరు30: శ్యామ్‌ప్రసాద్‌ రూర్బన పథ కం అమలులో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. ఈ ఏడాది ఆక్టోబరు 21న ఈ పథకాలకు సంబంధించి ప్రజావేదిక నిర్వహించి.. చూపించని ఎం-బుక్కులపై మరోసారి ప్రజావేదిక నిర్వహిస్తామని తేల్చిచెప్పారు. మంగళవారం ప్రిసైడింగ్‌ అధికారి, ఏపీడీ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజావేదికను చేపట్టారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 372 పనులకుగాను 162 పనులకు ఎం-బుక్కులు చూపించలేకపోయారు. రూ.62. 25 లక్షల రికవరీకి ఆదేశాలు జారీ చేశారు. రాళ్లఅనంతపురం లో రూ.7.50 లక్షలకు సంబంధించి సీసీ రోడ్డు వేశారే కా నీ... అందుకు ఎం-బుక్కులు చూపించకపోగా బిల్లు మాత్రం మం జూరు చేసినట్లు ప్రజావేదికలో వెల్లడించారు. కర్తనపర్తిలో రూ.1.80 లక్షలకు సిమెంట్‌ తీసుకున్నారే తప్పా.. అందుకు సం బంధించి పూర్తిస్థాయిలో మంజూరు చేసినట్లు నమోదైంది. క్షేత్రస్థాయిలో సిమెంట్‌, పని జరగలేదని తేల్చిచెప్పారు. పండ్ల మొక్కల పెంపకంలో భాగంగా రూ.12.79 లక్షలకుగాను రూ. 76 వేలకు మాత్రమే రికార్డులు సమర్పించారని సామాజిక త నిఖీ బృందం ప్రజావేదికలో అధికారులకు వివరించారు. వైసీపల్లిలో సిమెంట్‌ రోడ్డుమీదే మూడు ప్రాంతాల్లో మూడు చోట్ల రోడ్డుపై రోడ్డు వేసి రూ.8 లక్షల ప్రజాధనం దుర్వినియోగం చేశారన్నారు. ఈవిషయమై ప్రిసైడింగ్‌ అధికారి సంబంధిత ఇంజనీర్లను ప్రశ్నించగా ఒకరిపైనొకరు వాస్తమేనని ప్రజావేదికలో చెప్పడంతో అధికారులు కంగుతిన్నారు. కురాకులపల్లిలో రూ.1,28,201, కర్తనపర్తిలో  రూ.8,12,149, రాళ్లఅనంతపురంలో రూ.17,50,345, ములకనూరులో రూ.70980, గొల్లపల్లిలో రూ.2000, మరిమాకులపల్లిలో రూ.35055, కంబదూరులో రూ.1095491, చెన్నంపల్లిలో రూ.30వేలు, రాంపురంలో  రూ.7,61,639, తిమ్మాపురంలో రూ.2వేలు, నూతిమడుగులో రూ.15,29147లు రికవరీకి ఆదేశించినట్లు ప్రిసైడింగ్‌ అధికారి తెలిపారు. 534 పనులకుగాను రూ.25 కోట్లు ఖర్చు చేయడంతో వాటికి సంబంధించి సీసీ రోడ్డు, భవనాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పండ్ల మొక్కల పెంపకం, వర్మీకంపోస్ట్‌ తదితర పనులకు సంబంధించి సామాజిక తనిఖీ బృందం చేపట్టిన వివరాలను ప్రజావేదికలో బహిర్గతం చేశారు. సమావేశంలో రూర్బన స్టేట్‌ కోఆర్డినేటర్‌ ఇందిరాప్రియదర్శిని, ప్రోగ్రామ్‌ మేనేజర్‌ సునీల్‌, రాష్ట్ర బృందం మేనేజర్‌ కోనయ్య, ఎస్‌ఆర్‌పీలు చంద్ర, మీరావళి, జిల్లా విజిలెన్స అధికారి రమణారెడ్డి, డిప్యూటీ సీఓ శ్రీనివాసులు, డీఈ రాజన్న, ఎంపీడీఓ శివారెడ్డి, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement