Abn logo
Nov 22 2020 @ 11:17AM

సీఎం జగన్‌పై మండిపడ్డ బీజేపీ నేత హరీష్‌బాబు

Kaakateeya

కర్నూలు: తుంగభద్ర పుష్కరాల విషయంలో ఏపీ సర్కారు తీరుని నిరసిస్తూ చలో తుంగభద్రకి హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర నేత హరీష్ బాబు సంకల్ బాగ్ ఘాట్ వద్ద తుంగభద్ర నదిలో దిగి పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. పుష్కరఘాట్లలో స్నానాలు ఆచరించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తే..జగన్ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. జగన్‌కి వ్యతిరేకంగా నినాదాలు  చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు..వీహెచ్‌పీ, బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. 

Advertisement
Advertisement