దేవరగట్టు రక్తసిక్తం

ABN , First Publish Date - 2021-10-17T08:26:35+05:30 IST

దేవరగట్టు రక్తసిక్తం

దేవరగట్టు రక్తసిక్తం

కర్నూలు, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): దేవరగట్టు మరోసారి రక్తసిక్తమైంది. విజయదశమి సందర్భంగా కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు బన్ని ఉత్సవంలో శుక్రవారం ఆర్ధరాత్రి దాటిన తర్వాత మొదలైన స్వామివారి జైత్రయాత్ర శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. ఈ కర్రల సమరంలో 47మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ వేడుకలకు కర్నూలు జిల్లాతో పాటు కర్ణాటక నుంచి భక్తులు భారీగా వచ్చారు.  నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్థులు రాత్రి 11 గంటల ప్రాంతంలో డొళ్లినబండ వద్దకు చేరుకొని కొండపైన ఆలయంలో మాళమల్లేశ్వరుడికి కల్యాణోత్సవం నిర్వహించి పల్లకిని ఊరేగింపుగా (జైత్రయాత్ర) కొండ దిగువకు తీసుకువచ్చారు. ఉత్సవ విగ్రహాలు ఎదురు బసవన్న గుడికి, అక్కడినుంచి మల్లప్ప గుడికి చేరుకున్నాయి. కాగా, జైత్రయాత్రకు ముందే రెండు వర్గాల వారు కర్రలతో కొట్టుకున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారన్న ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - 2021-10-17T08:26:35+05:30 IST