కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల ఆవేదన

ABN , First Publish Date - 2021-06-15T18:09:03+05:30 IST

కరోనా సోకి తల్లి కన్ను మూసింది.. అప్పుల బాధ తాళలేక తండ్రి ప్రాణం తీసుకున్నాడు.

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల ఆవేదన

కర్నూలు జిల్లా: కరోనా సోకి తల్లి కన్ను మూసింది.. అప్పుల బాధ తాళలేక తండ్రి ప్రాణం తీసుకున్నాడు. దీంతో వారి పిల్లలిద్దరు అనాథలుగా మిగిలారు. నిన్నటి వరకు తల్లిదండ్రులు నీడలో పెరిగిన చిన్నారులు కరోనా కారణంగా అనాథలైపోతున్నారు. అప్పటి వరకు ఆడుతూ.. పాడుతూ సాగిన వారి చిన్నతనం ఊహించని విధంగా కష్టాల కడలిలో చిక్కుకుంటుంది. కడుపునిండా తిని, చీకు చింతా లేకుండా హాయిగా నిద్రపోయిన పిల్లలు అదే నట్టింట్లో బిక్కు బిక్కుమంటూ ఉండాల్సిన దుస్థితి. మహమ్మారి బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన ఎందరో పిల్లలది ఇదే దుస్థితి. ప్రభుత్వం తన వంతుగా సహాయం అందిస్తున్నప్పటికీ వారి ఆలనా పాలన చూసేదెవరు? వారి భవిష్యత్‌కు భరోసా ఎవరు? కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలం, పాత కందుకూరుకు చెందిన ఈ పిల్లలది ఇప్పుడు అదే పరిస్థితి.

Updated Date - 2021-06-15T18:09:03+05:30 IST