కర్నూలు: నివర్ తుపాన్ ముప్పు జిల్లాకు పొంచివుంది. దీంతో అధికారులను జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ అప్రమత్తం చేశారు. తుపాన్ ముప్పు ప్రభావంతో రైతులు పంటల కోతలను వాయిదా వేసుకోవాలలని అధికారులు సూచించారు. తుపాన్ కారణంగా కర్నూలు, నంద్యాల, ఆందోనిలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు చేశారు. పుష్కరాల విధుల్లో ఉన్న పోలీసులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు. అనధికారికంగా నడుపుతున్న పడవలను వెంటనే ఆపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.