Kurnool: శ్రీశైలం ప్రాజెక్ట్‎కు తగ్గిన వరద ఉధృతి

ABN , First Publish Date - 2021-08-07T13:17:45+05:30 IST

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 2 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ కు ఇన్ ఫ్లో: 58,629 క్యూసెక్కులు కాగా

Kurnool: శ్రీశైలం ప్రాజెక్ట్‎కు తగ్గిన వరద ఉధృతి

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 2 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ కు ఇన్ ఫ్లో: 58,629 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో: 1,53,284 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.40 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 212.4385 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

Updated Date - 2021-08-07T13:17:45+05:30 IST