Kurnool: శ్రీశైలం ప్రాజెక్ట్‌కు పెరుగుతున్న వరద ఉధృతి
ABN , First Publish Date - 2021-10-09T13:34:42+05:30 IST
శ్రీశైలం ప్రాజెక్ట్‌కు భారీగా వరద ఉధృతి పెరుగుతుంది. దీంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,03,864 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 66,534 క్యూసెక్కులుగా కొనసాగుతుంది
కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్ట్‌కు భారీగా వరద ఉధృతి పెరుగుతుంది. దీంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,03,864 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 66,534 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.50 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 201 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో నుంచి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.